ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరపడండి!

Purushottham Vinay
కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక అర్హులైన, ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.కాబట్టి ఆసక్తి ఇంకా అర్హతలు కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.ఇక ఈ పోస్టులు అనేవి గ్రూప్ సీ పరిధిలోకి వస్తాయి. ఐదంకెల వేతనం కలిగిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వేతనం ఇంకా అలాగే ఇతర ముఖ్య తేదీలు తదితర వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం!

మొత్తం ఖాళీలు :
1.హెడ్ కానిస్టేబుల్ (పురుషులు)-135
2.హెడ్ కానిస్టేబుల్ (స్త్రీలు)-158
3.హెడ్ కానిస్టేబుల్ (ఎల్‌డీసీఈ) - 90

వేతనం విషయానికి వస్తే:
రూ.25,500-రూ.81,100 ఉంటుంది.(7వ వేతన కమిషన్ ప్రకారం)

విద్యార్హతలు విషయానికి వస్తే:
ఇక అభ్యర్థులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 సర్టిఫికెట్ ని కలిగి ఉండాలి. కంప్యూటర్‌పై ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేసే స్కిల్ కూడా ఉండాలి.

వయో పరిమితి :
హెడ్ కానిస్టేబుల్ (డైరెక్ట్ ఎంట్రీ) పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకునేవారు 18 నుంచి 25 ఏళ్ల లోపువారై ఉండాలి. ఇక అభ్యర్థులు 2/01/0/1997 కన్నా ముందు జన్మించి ఉండరాదు. హెడ్ కానిస్టేబుల్ (ఎల్‌డీసీఈ) పోస్టులకు 35 ఏళ్లు లోపు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఇంకా అలాగే ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ముఖ్య తేదీలు :
జూన్ 8, 2022 నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతంది. చివరి గడువు వచ్చేసి జూలై 7, 2022.

ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే :
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే వీటికి అప్లై చేసుకోవాలి.ఇక ఆఫ్‌లైన్‌లో పంపించే దరఖాస్తులు స్వీకరించరు. www.recruitment.itbpolice.nic.in ద్వారా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అనేది అధికారిక వెబ్‌సైట్‌లో మీకు అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: