శుభవార్త : మరోసారి భారీగా పోస్టల్ ఉద్యోగాలు!

Purushottham Vinay
ఇక ఇండియా పోస్ట్ మరోసారి దేశవ్యాప్తంగా కూడా గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇంకా అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలుపెట్టింది.ఇక గతంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్  విడుదల చేసిన ఇండియా పోస్ట్ ఇంకా ఈసారి 35 సర్కిళ్లలో 38,926 పోస్టుల భర్తీకి ఒకేసారి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం.ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా కూడా మొత్తం 38,926 పోస్టుల్ని భర్తీ చేస్తుంటే తెలంగాణలో 1226 ఇంకా అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టులున్నాయి. అలాగే మొత్తం కలిపి తెలుగు రాష్ట్రాల్లో 2,942 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతోంది.2022 జూన్ 5 లోగా వీటిని అప్లై చేయాలి.ఇక అలాగే విద్యార్హతల వివరాలు కనుక చూస్తే అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావాలి. మ్యాథమెటిక్స్ ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ తప్పనిసరి. స్థానిక భాషలో 10వ తరగతి దాకా ఖచ్చితంగా చదివి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఇంకా అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు ఇంకా అలాగే దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు అనేది ఉంటుంది.అలాగే దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు ఇంకా ట్రాన్స్‌వుమెన్‌కు ఫీజు లేదు. వేతనాల వివరాలు చూస్తే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12,000 ఇంకా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 ఉంటుంది. మెరిట్ ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు.


ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ ని ఓపెన్ చేయాలి.ఇక హోమ్ పేజీలో వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు లింక్స్ ఉంటాయి. ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి ఆ లింక్స్ పై క్లిక్ చేయొచ్చు. అక్కడ రిజిస్ట్రేషన్ చేయడానికి Registration పైన క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ ఇంకా అలాగే ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి. పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, 10వ తరగతి పాసైన వివరాలు ఇంకా అలాగే ఆధార్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ ని పూర్తి చేయాలి.ఫోటో, సంతకం ఇంకా అలాగే టెన్త్ మెమో అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత Apply పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా సర్కిల్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అడ్రస్, పదవ తరగతిలో వచ్చిన మార్క్స్ ఇంకా ఇతర వివరాలతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: