నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్ లో ఉద్యోగాలు!

Purushottham Vinay
నిరుద్యోగులకు శుభవార్త.ఇక దేశంలో ఇప్పటి దాకా 11.6 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించామని ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా వెల్లడించింది. ఎగుమతుల విలువను 5 బిలియన్ డాలర్లకు పెంచడం సహా 40 లక్షలకుపైగా ఎమ్ఎస్ఎంఈలను డిజిటలైజ్ చేశామని కంపెనీ పేర్కొంది.అమెజాన్ సంభవ్ పేరుతో 2020 జనవరి నెలలో జరిగిన వార్షికోత్సవంలో.. ‘2025 వ సంవత్సరం నాటికి దేశంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాము. అంతేకాదు ఎగుమతులను 10 బిలియన్ డాలర్లకు ఇంకా కోటికిపైగా ఎమ్ఎస్ఎంఈలను కూడా డిజిటలైజ్ చేస్తామని అమెజాన్ వాగ్దానం చేసింది.ఈ క్రమంలో ఆ ప్రకటనకు సంబంధించి ఇప్పటి దాకా తాము చేపట్టిన చర్యలపై అమెజాన్ ఆదివారం వివరాలను వెల్లడించింది. అమెజాన్ పేర్కొంటున్న 11.6 లక్షల ఉద్యోగాల్లో కొన్ని నేరుగా కంపెనీలో పనిచేసేవి కాగా మరికొన్ని దానికి అనుబంధంగా ఉండే రంగాలకు చెందినవి. 


డెలివరీ, లాజిస్టిక్స్, రవాణా ఇంకా అలాగే ప్యాకేజింగ్ మొదలైనవి ఈ కోవకు చెందినవే. గత సంవత్సరం జరిగిన వార్షికోత్సవంలో అమెజాన్ సంభవ్ వెంచర్ పేరుతో వెంచర్ క్యాపిటల్ను కూడా స్టార్ట్ చేసింది .. సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించే స్టార్టప్స్లో పెట్టుబడులు పెడతామని కూడా పేర్కొంది. ఇప్పటికే మైగ్లామ్, ఎం1ఎక్స్ఛేంజ్ ఇంకా స్మాల్ కేస్ మొదలైన సంస్థల్లో పెట్టుబడి పెట్టింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలతో కలిసి పనిచేస్తున్నాము. కాబట్టి భారత్లో వ్యాపార రంగం వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించే టెక్నాలజీ ఇంకా అలాగే టూల్స్ వంటివి అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. కేవలం గత సంవత్సరంలో అమెజాన్.. ఐటీ, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, తయారీ ఇంకా అలాగే కంటెంట్ క్రియేషన్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో 1,35,000 లక్షల ఉద్యోగాలను సృష్టించింది.నిజంగా ఇది నిరుద్యోగులకు మంచి శుభవార్త అనే చెప్పాలి.కాబట్టి ఆసక్తి గలవారు ఖచ్చితంగా వీటికి అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: