టెట్ అప్లికేషన్ గడువు పొడిగించాలని డిమాండ్?

VAMSI
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో టెట్ కు సంబందించిన హడావిడి నెలకొంది. చాలా  కాలం తరవాత మళ్లీ టెట్ పరీక్షల నిర్వహిస్తుండడంతో అభ్యర్దుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  సోమవారం సాయంత్రం వరకు కూడా టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ కొరకు అభ్యర్దులు దరఖాస్తులు చేశారు.  6,04,035 వరకు దరఖాస్తులు అందాయి. కాగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు మంగళవారం లాస్ట్ డేట్ కాగా  ఫీజు చెల్లించే గడువు అయితే ఇప్పటికే ముగిసింది. అయితే మిస్స్ అయిన అభ్యర్దులు, విద్యార్థి సంఘాలు మరి కొన్ని రోజులు దరఖాస్తు కొరకు గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
మార్చి 26 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది అంటే గడువు తేదీ లోపు కేవలం 16 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారు. కాబట్టి చాలా మంది అభ్యర్దులు పలు కారణాల వలన అప్లై చేసుకోలేక పోయారు. మరి 16 రోజులు గడువు అంటే చాలా తక్కువ కాబట్టి అభ్యర్ధుల అభ్యర్ధనను అర్దం చేసుకుని గడువు తేదీని పొడిగించాలని గట్టిగా కోరుతున్నారు.  కానీ ఇప్పటికే దరఖాస్తులు చేసుకునే గడువు ముగియగా... అన్నిటినీ ప్రణాళిక బద్దంగా చేస్తున్న క్రమంలో మరి కొన్ని రోజులు గడువు పెంచడం అంటే సమస్యాత్మకంగా మారుతుందని కావున గడువు పెంచడం కుదరదని అధికారులు అంటున్నారు.  
మరో వైపు ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అవకాశమివ్వడంతో దాని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.  అంతే కాకుండా టెట్ అప్లికేషన్లకు గడువు పెంచాల్సిదిగా విజ్ఞప్తి చేస్తూ  ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనను కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. మరి అభ్యర్థుల బాధను అర్ధం చేసుకుని ఈ విషయం పై అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: