విద్యార్థులకు షాక్: టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా?

VAMSI
కరోనా వైరస్ ప్రజల జీవితాలను చిన్నా భిన్నం చేసింది. దీని రాకతో మన జీవనశైలి సైతం మార్చుకోవాల్సి వచ్చింది. గతంలో కరోనా ఉద్యమిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు విద్యాసంస్థలకు సైతం సెలవులు ప్రకటించారు. కానీ అదే విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గత సంవత్సరం పరీక్షలు లేకుండానే పదవ తరగతి విద్యార్థులను పాస్ చేశారు. దీని వలన ఎందరో విద్యార్థులు మనస్థాపం చెందారు. ఇలా జరిగిన అనంతరం గత సంవత్సరం ఆగస్ట్ నుండి విద్యాసంస్థలు యధావిధిగా కొనసాగుతున్నాయి. విద్యాసంస్థలు మొదలై ఎనిమిది నెలల మాత్రమే అయింది. అప్పుడే పబ్లిక్ పరీక్షల సందడి మొదలై పోయింది.

ఈ రోజు ఒక మీడియా సమావేశంలో భాగంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై కీలక ప్రకటన చేసింది. త్వరలో JEE MAIN పరీక్షలు జరుగనున్నాయి. అయితే ఈ పరీక్షలకు అంతరాయం కలుగకుండా ఇప్పటికే ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను మార్చనున్నామని మంత్రి సబితా తెలిపారు. కొత్త తేదీలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఆమె చెప్పారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇంటర్ విద్యార్థులు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే ఏపీ లోనూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే మొదటి వారం నుండి పరీక్షకు జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీని మే రెండవ వారానికి అంటే 9 వ తేదీ కి మార్చబోతున్నట్లు తెలుస్తోంది.

దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా దాదాపుగా ఇదే షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి మరొక కారణం కూడా ఉందట... ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు జరుగుతాయి. అయితే ముందు ఇచ్చిన టెన్త్ షెడ్యూల్ ప్రకారం మే 2 నుండి 13 వరకు పరీక్షలు ఉంటాయి. అయితే రెండు పబ్లిక్ పరీక్షలు ఒకేసారి అవడంతో సిబ్బంది, ఏర్పాట్లు, మిగిలిన అంశాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఈ తేదీలను మర్చనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: