పాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్లు లీక్... విద్యార్థుల భవిష్యత్తుతో ఈ ఆటలేంటి ?
ఇంతకీ అసలు విషయం ఏమిటో చూద్దాం. తెలంగాణ లో ఫిబ్రవరి 8 నుండి పాలిటెక్నిక్ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా అక్కడ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణలోని హైదరాబాద్ లో శివారు బాటసింగారు స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజీ లో పాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది. ఈ విషయాన్ని గుర్తించిన బోర్డ్ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ కాలేజీలో what's యాప్ ద్వారా ప్రశ్నపత్రం ఇతరులకు లీక్ అయినట్లు వారు గుర్తించారు. దాంతో ఈ అంశం పై బోర్డ్ అధికారులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు రిజిష్టర్ చేశారు.
ప్రస్తుతం ఆ కాలేజీ లో క్వశ్చన్ పపేర్ లీకేజీ పై దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో అసలు ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం ఇదే మొదటి సారా ? ఏయే పేపర్లు లీకయ్యాయి ? ఎవరెవరికి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి అన్న వివరాలు రాబట్టేందుకు పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. వీలైనంత త్వరగా ఈ కేసును పరిష్కరిస్తామని తెలిపారు. కానీ నేడు ఇలా ప్రశ్న పత్రాలు లీకవ్వడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ఏమి కావాలి. ఎందుకు ఇలా లీకు రాయుళ్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.