యూపీఎస్సీ 2022 సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల.. 861 ఉద్యోగాల భర్తీ..!!
ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరడం జరుగుతుంది. ఐఏఎస్ , ఐపీఎస్ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.. ఇక ఇందులో మీరు పూర్తి వివరాల కోసం.. https://www.upsc.gov.in/ వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు..
ఈ పోస్టుల వివరాలు విషయానికి వస్తే..
మొత్తం ఖాళీలు - 861
అర్హత - ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు.
వయోపరిమితి: 2022 ఆగస్టు 1 నాటికి 21 సంవత్సరాలు వుండాలి . అంతేకాదు 32 సంవత్సరాలు మించి ఉండకూడదు. 1990 ఆగస్టు 2 నుండి 2001 ఆగస్టు ఒకటి మధ్య జన్మించిన వారు అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వంటి రిజర్వడ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే రాత పరీక్ష ప్రిలిమ్స్ ఆ తర్వాత మెయిన్స్ అనే రెండు స్టేజ్ లలో ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ 2022 ఫిబ్రవరి 22.. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 2022 జూన్ 5.. దరఖాస్తు ఫీజు ఓబీసీతో పాటు ఇతర అభ్యర్థులకు ₹100 , ఎస్సీ ,ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కూడా ఉంటుంది.