నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : BSNL లో ఉద్యోగాలు..

Purushottham Vinay
ఈ మధ్య పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల చేస్తున్న సంస్థ తాజాగా మరో నోటిఫికేషన్ (Notification) రిలీజ్ చేసింది. లీగల్ ప్రొఫెషనల్స్ (Fulltime Young Legal Professionals) విభాగంలో ఈ నియామకాలను చేపట్టడం జరిగింది. అయితే ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. మొదట కాంట్రాక్ట్ గడువు సంవత్సరం ఉంటుంది. అభ్యర్థుల పర్ఫార్మెన్స్ ఇంకా అవసరాల రిత్యా కాంట్రాక్ట్ ను 2, 3 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.
LLB చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు విద్యార్హత పొందిన సంస్థ ఖచ్చితంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) తో గుర్తింపు పొంది ఉండాలి. అభ్యర్థులు LLBలో తప్పనిసరిగా 60 శాతం మార్కులను సాధించి ఉండాలి. విద్యార్హత తరువాత మూడేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75 వేల జీతం చెల్లించనున్నారు. జీతం మినహా ఏ ఇతర అలవెన్స్ లు ఇవ్వబడదని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. ఇంకా సెలెక్ట్ అయిన అభ్యర్థులు బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్ ఇంకా న్యూ డిల్లీలో లో పని చేయాల్సి ఉంటుంది.
వీటికి ఎలా అప్లై చేయాలంటే:
Step 1: అర్హత ఇంకా ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 2: తరువాత మీకు నోటిఫికేషన్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.
Step 3: తరువాత Click here for Registration అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై మీరు క్లిక్ చేయాలి.
Step 4: అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదటగా ఇక New Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: పేరు ఇంకా ఇతర సూచించిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 6: తరువాత మొబైల్ నంబర్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి లాగిన్ అయి అప్లై చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: