సీఎం కీలక నిర్ణయం.. పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్..!

N.ANJI

కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటి నుంచి విద్యార్థులు ఎంతో నష్టపోయారు. అకాడమిక్ ఇయర్ పూర్తిగా దెబ్బతినడంతోపాటు.. చదువుపై పూర్తిగా శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ వచ్చారు. సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలను రీ ఓపెన్ చేశాయి. కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులకే పరిమితమవుతున్నాయి. అయితే కరోనా కారణంగా ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేయడం.. లేదా పాస్ చేయడం జరిగింది.


అయితే ఈ ఏడాది ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే ఎన్ని రోజులపాటు కొనసాగుతాయో తెలియని పరిస్థితి. క్లాసులు ఉంటాయా.. మళ్లీ లాక్‌డౌన్ కొనసాగుతుందా లేదా తెలియని విద్యార్థులు సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టెన్త్, ఆపై తరగతులు చదివే విద్యార్థులు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. క్లాసులు సరిగ్గా జరగకపోవడంతో సర్వత్రా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి టెన్త్ విద్యార్థులకు శుభవార్తను అందజేశారు.


విద్యార్థుల్లో నెలకొన్న పని ఒత్తిడిని తగ్గించేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న పరీక్షల పేపర్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు టెన్త్ పరీక్షలకు 11 పేపర్లు నిర్వహించగా.. కరోనా నేపథ్యంలో ఆ సంఖ్యను 7కు కుదించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సప్లమెంటరీ పరీక్షలు కూడా 7 పేపర్ల ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని సబ్జెక్టులకు ఒకే ఎగ్జామ్ ఉండగా.. సైన్స్ పేపర్‌కు రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రానికి 50 మార్కులు, బయాలజీకి 50 మార్కులు ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులకు 100 మార్కులు ఉంటాయి. కాగా, ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ కళాశాలకు సెలవులు ప్రకటించింది. సంక్రాతి సెలవుల్లో ఎవరూ స్కూళ్లు ఓపెన్ చేయవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: