తెలంగాణ :ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో.. అందరూ పాస్..!

MOHAN BABU
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తుంది. సరైన విద్యార్థులందరికీ కనీసం 35 శాతం మార్కులు వేసే యోచనలో ఉంది. ఫలితాల నివేదికను పరిశీలిస్తున్న ప్రభుత్వం రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్ష రాసిన విద్యార్థులందర్నీ పాస్ చేయాలని యోచిస్తోంది. ఇటీవల ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరూ ఆందోళనలు చేస్తున్నారు.

 దీంతో పైన విద్యార్థులందరికీ 35శాతం కనీస మార్కులు వేసి పాస్ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకొనుందని తెలుస్తోంది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే పాసయ్యారు. పాస్ అయిన వారిలో 25 శాతం మంది విద్యార్థులు 75 శాతానికి పైగా మార్కులు సాధించారు. కనీస మార్కులు 35 నుంచి 50 శాతం మధ్య  సాధించిన విద్యార్థులు మూడు శాతం మంది మాత్రమే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థుల ఎక్కువమందికి ఐదు నుంచి పది శాతం మార్కులు  మాత్రమే  వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు సరైన బోధన జరగకపోవడం, పదవ తరగతిలో పరీక్ష రద్దు చేసి అందరినీ పాస్ చేయడమేనని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఫెయిలైన విద్యార్థులందరినీ కనీసం మార్కులతో పాస్ చేయడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కూడా ఫలితాలపై అధ్యయనం చేస్తోంది. గతేడాది కరోనాతో ఇంటర్ వార్షిక పరీక్షలను రద్దు చేసినప్పుడే సరైన నిర్ణయం తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసి అందరికీ 35 శాతం మార్కులు ఇచ్చి పాస్ చేసినా,తర్వాత ఇంప్రూమెంట్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఎక్కువ మార్క్స్ సాధించిన స్టూడెంట్ కు కొత్త మార్కులను ఇచ్చారు. తక్కువ మార్కులు వచ్చిన వారికి 35 శాతాన్ని అలాగే ఉంచారు. దీంతో విద్యార్థులు ఫెయిల్ అన్న సమస్యే రాలేదు.

 తెలంగాణలో మాత్రం పరీక్షలను రద్దు చేసి స్టూడెంట్స్ ని సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేశారు. దీంతో సెకండియర్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ లో బ్యాక్లాగ్ లు ఉండి పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో సెకండ్ ఇయర్ లో అన్ని సబ్జెక్టులు పాస్ అయిన మొదటి సంవత్సరం బ్యాక్లాగ్స్ ను క్లియర్ చేయకపోతే మొత్తం ఇంటర్ ఫెయిల్ అయినట్లే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ 35 శాతం మార్కులు ఇచ్చి పాస్ చేసే విధంగా ఆలోచిస్తోంది. ఫెయిలయిన విద్యార్థుల భవితవ్యం నిర్ణయించేందుకు ఇంటర్ బోర్డు కాసేపట్లో బేటీ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: