ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త...?

VAMSI
ఇంటర్ పాస్ అయిన విద్యార్ధులకి లడ్డు లాంటి వార్తను తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఇంటర్ పాసయితే ఈ అవకాశం మీకోసమే ఎదురు చూస్తోంది. ఇంతకీ అసలు ఏంటా అద్భుతమైన శుభవార్త అంటే, జాతీయ స్కాలర్‌షిప్‌ స్కీమ్-2021 కోసం ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది కేంద్ర విద్యా శాఖ.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి,
ఏ విద్యార్థి అయితే ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 80% పైగా మార్కులను తెచ్చుకుని కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.6 లక్షల కంటే తక్కువ ఉంటుందో, అదే విధంగా ఆ విద్యార్థులు ప్రతిభావంతులై ఉన్నత చదువులు చదవాలని ఆశ ఉన్నా ఆర్ధిక స్తోమత తక్కువగా ఉంటుందో, అటువంటి విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు పూర్తిగా అర్హులుగా తెలిపింది కేంద్ర విద్యా శాఖ. ఇక ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు తొలి మూడు సంవత్సరాలు ఏటా రూ.10 వేలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లోకి నగదును జమ చేయనున్నట్లు కేంద్ర విద్యా శాఖ తెలిపింది.
అనంతరం నాలుగు, ఐదు సంవత్సరాలలో ఏడాదికి రూ.20,000 స్కాలర్ షిప్ లు ఇలా ఆ విద్యార్థులు గ్రాడ్యుయేషన్, పీజీ కంప్లీట్ అయ్యే లోపు మొత్తం రూ.70 వేల వరకు ఆ విద్యార్థికి స్కాలర్ షిప్ అందుతుంది.
అయితే ఈ పథకం కింద స్కాలర్ షిప్ ను పొందాలంటే క్రింది విషయాలు గుర్తుంచుకోవాలి.
* సదరు విద్యార్థి ఎవరూ కూడా ఇతర స్కాలర్‌షిప్‌ లు మరియు పధకాలు ఏవీ కూడా ఉన్నత విద్య కోసం ఆ విద్యార్థి పొంది ఉండకూడదు.
* అదే విధంగా ఈ పథకానికి అర్హత కొరకు రెగ్యులర్ కోర్సులు మాత్రమే తీసుకుని వాటిలోనే ప్రావీణ్యం పొందాలి. డిప్లమా వంటి స్పెషల్ కోర్సులు అభ్యసిస్తున్న వారు ఈ పదకానికి అర్హులు కారు.
* కరస్పాండెన్స్ వాళ్ళు ఈ స్కాలర్ షిప్ అప్లై చేయడానికి అర్హులు కారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: