ప్రపంచ.. ఉపాధ్యాయ 'దినో'త్సవం.. !

నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ రోజు గురువులకు ప్రత్యేకమైన రోజు. దీనిని 1994 నుండి జరుపుకుంటున్నాము. దీనిని 1966 లోనే యునెస్కో గుర్తించింది. అప్పటినుండి యునెస్కో తరుపున ఉపాధ్యాయుల జీవనప్రమాణాలు, వారి సమస్యలు తదితర విషయాలపై ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఉంది. ఇంకా వారి నియామకాలు, తర్ఫీదు, వారి విద్య, ఉపాధి వంటి విషయాలను కూడా యునెస్కో గమనిస్తుంది. యునెస్కో తద్వారా ప్రపంచ వ్యాప్త ఉపాధ్యాయ దినోత్సవాన్ని తీసుకువచ్చి వారికి ప్రోత్సహకాలు ఇస్తుంది. ఈ రోజుని వారి  కోసం కేటాయించడం ద్వారా వారివారి సమస్యలు తెలుసుకుంటుంది. బోధనసమయంలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకుంటుంది.
ఒక మంచి సమాజాన్ని తీర్చిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర విలువను ప్రపంచానికి తెలియజేయడం ద్వారా వారిపట్ల గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తుంది యునెస్కో. దీనికోసం ప్రతి ఏడాది ఒక ప్రత్యేక సిద్ధాంతాన్ని పెట్టుకోవడం ద్వారా ఆయా సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తారతమ్యం లేకుండా అందరికి అన్నివిధాలా సహకరించేందుకు ఎప్పుడు సిద్దంగానే ఉంటుంది. ఈ ఏడాది విద్యావ్యవస్థలో కరోనా కారణంగా వచ్చిన లోపాలు, స్తబ్దత ను తొలగించాలని నిర్ణయించుకుంది. అంటే కరోనా కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయా సమస్యలు తీర్చి, వారివారి విద్యాపరమైన ఆవశ్యకతలను తీర్చేందుకు పూనుకుంది యునెస్కో.
కరోనా సమయంలో విద్యార్థులు దాదాపు చాలా సమయం విద్యాలయాలకు దూరంగానే గడపాల్సి వచ్చింది. ఉపాధ్యాయులు కూడా ఉన్న సౌకర్యాలతోనే విద్యార్థులకు ఆన్ లైన్ విద్యా బోధన చేయాల్సి వచ్చింది. ప్రారంభంలో ఇదే పెద్ద సమస్యగా ఉన్నప్పటికీ రానురాను అలవాటు అయ్యింది. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ  విద్యార్థులు కూడా వారికి ఉన్న సౌకర్యాలతోనే ఆన్ లైన్ పాట్యంశాలు వినాల్సి వచ్చింది. దీనితో విద్యార్థులు ఎక్కువ సమయం మొబైల్ లేదా లాప్ టాప్ ముందు గడుపుతూ చాలా ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా అదేతరహాలో విద్యార్థులకు అన్ని సమయాలలో అందుబాటులో ఉండేందుకు సిద్ధం అవ్వాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరినీ మళ్ళీ విద్యాలయాలకు మళ్ళించాలంటే అదేదో కొత్త వాతారణం అనేంత కాలం గడిచిపోయింది. ఈ సమస్యలను అధిగమించి అందరు మళ్ళీ సాధారణ విద్యాబ్యాసానికి సిద్ధం చేయడమే ఈ ఏడాది యునెస్కో సిద్ధాంతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: