ఐటిఐ విద్యార్థులకు NPCIL లో అప్రెంటిస్ గా ఖాళీలు..

Purushottham Vinay
విద్యార్థులకు శుభవార్త.10 వ తరగతి పాసై ఐటిఐ చదివిన వారికి ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పాలి. కాబట్టి ఆసక్తి, అర్హత వున్న అభ్యర్థులు ఏమాత్రం చెయ్యకుండా ఈ ఈ అప్రెంటీస్ పోస్టుల గురించి తెలుసుకొని అప్లై చేసుకోండి.న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, కైవర్ సైట్ కోసం అప్రెంటీస్ చట్టం -1961 కింద 75 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 15, 2021 న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్, npcil.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
NPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2021 వివరాలు
పోస్ట్: ట్రేడ్ అప్రెంటీస్
ఖాళీల సంఖ్య: 75
స్టైపెండ్: 7700- 8855/- (నెలకు)
NPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2021 ట్రేడ్ వారీగా వివరాలు..
ఫిట్టర్: 20
టర్నర్: 04
మెషినిస్ట్: 02
ఎలక్ట్రీషియన్: 30
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్): 04
ఎలక్ట్రానిక్ మెకానిక్:09
పంపు ఆపరేటర్ మరియు మెకానిక్: 05
డ్రాఫ్ట్ మాన్ (సివిల్): 04
సర్వేయర్: 02
మొత్తం: 75
NPCIL అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2021
అర్హత ప్రమాణాలు:10+2 విద్యా విధానంలో సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ లేదా సంబంధిత ట్రేడ్‌లో దాని సమానమైన మరియు ITI పాస్ సర్టిఫికెట్‌తో అభ్యర్థి 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల అభ్యర్థులు npcilcareers.co.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 30, 2021
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 15, 2021
NPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2021 ఎంపిక ప్రక్రియ: వారి ITI స్టాండర్డ్/కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
NPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్: npcil.nic.in
ఇక ఇంకెందుకు ఆలస్యం అర్హత, ఆసక్తి వున్న అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: