వీధి బడి.. కరోనా ఎఫెక్ట్

కరోనా అనేక సంస్థలలో పెను మార్పులు తీసుకువచ్చింది. అందులో విద్యా వ్యవస్థ చెప్పుకోదగ్గది. ఒకటిన్నర ఏడాదిగా విద్యాసంస్థలు మూసివేసే ఉన్నాయి. అయితే తాజాగా పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అయితే కరోనా నిబంధనలు మాత్రం పాటించాలని వైద్యశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దానిప్రకారం ప్రతి విద్యార్థికి కనీస దూరం పాటించాల్సి ఉంది. ప్రతిసారి చేతులు శానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలకు హాజరైన విద్యార్థులకు జలుబు లాంటివి ఉంటె అనుమతించరాదు.. వంటి నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది.
ఈ పరిస్థితులలో కూడా కొందరు ఉపాధ్యాయులు అవకాశాలుగా భావించి విద్యార్థులకు బోధించడానికే కృషి చేస్తున్నారు. ఒక సమస్యను సమస్యగా మాత్రమే చుస్తే పరిష్కారం దొరకదు అన్న చందాన కరోనా అనే భయం కంటే దానిలో కూడా పని చేసుకుపోయే అవకాశాలు ఉన్నాయా అనేది పరిశీలించి ఆయా అవకాశాలు వెతుక్కుంటూ పోవడం తెలివైన వారి లక్షణం. ఇక్కడ కూడా ఉపాధ్యాయులు అదేవిధంగా ఆలోచించి, విద్యార్థులకు మేలు చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సెలవు వస్తుందా అని ఎదురుచూసుకుంటూ గడిపేవారు ఉంటె వారి వలన ప్రయోజనం మాత్రం శూన్యం. లాక్ డౌన్ సహా పలు పరిస్థితులతో విద్యకు దూరమైన పిల్లలను మళ్ళీ విద్యవైపు మళ్లించేందుకు ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
తాజాగా పశ్చిమబెంగాల్ లో కూడా ఒక ఉపాద్యాయుడు కూడా వినూత్న ప్రయత్నం ఒకటి చేసి భేష్ అనిపించుకున్నారు. అందుకు ఆయన తాను పాఠాలు చెపుతున్న అతి చిన్న గ్రామం లో ఎటువంటి సాంకేతికత అందుబాటులో లేకపోవటంతో ఉన్నవాటితోనే విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఆరంభించారు. అందుకు ఆయన గ్రామం మొత్తం పాఠశాలగా భావించారు, అదే తరహాలో విద్యార్థులను కరోనా నిబంధనల ప్రకారం కూర్చోబెట్టి బోధించడం ప్రారంభించాడు. ఆ గ్రామంలో గోడలు అన్నింటిపై ఆయా సబ్జక్ట్స్ పాఠాలు రాశాడు. రోడ్లపై విదార్దులను కూర్చోబెట్టాడు, పాఠాలు పిల్లలకు బోధించాడు. ఇది ఆసక్తిగా ఉండటంతో పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు, అది చుసిన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాఠ్యపుస్తకాలను కాకుండా కరోనా జాగర్తలు కూడా చక్కగా బోధిస్తుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: