మద్యం మత్తులో స్కూలుకు ఉపాధ్యాయుడు.. గ్రహించిన సర్పంచ్ ఏం..?

MOHAN BABU
విద్యార్థులకు  విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే గొంతులకు వచ్చేదాకా తాగి పాఠశాలకు వచ్చాడు. స్టూడెంట్స్ ఆదర్శంగా ఉండాల్సిన ఆ టీచరే మద్యం సేవిస్తే ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటి.. ఆయనను చూసి విద్యార్థులు ఏం నేర్చుకోవాలి. చదువు నేర్పాల్సిన ఆ సారే సన్నాసిలా  తయారైతే ఇక ఎవరికి చెప్పుకుంటారు. ఇప్పటికే విద్యార్థులు ఒక సంవత్సర కాలం నుంచి  చదువు లేక ఇంటి వద్దనే ఉంటూ ఉన్నది మర్చిపోయారు. ఇప్పటికైనా కరోణ తగ్గింది. ప్రభుత్వం గ్రహించి స్కూల్ స్టార్ట్ చేసింది. ఇంతలోనే ఈ ఉపాధ్యాయుడు ఈ విధంగా  మద్యం సేవించి స్కూల్ కి రావడం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. వరంగల్ జిల్లాలోని  వెంకటాపురం మండలానికి చెందిన చిరుత పల్లి పాఠశాలలో  ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తీ ఫుల్ గా మద్యం తాగి  తన విధులకు హాజరయ్యారు. మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ టీచర్ ను ఆ గ్రామ సర్పంచ్ అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలోని  చిరుత పల్లిలోని జిపిఎస్ పాఠశాలలో కామ రాజు అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయుడుగా విధులు  నిర్వహిస్తున్నాడు.

అయితే ఆయన  పాఠశాలలు ప్రారంభం అయినప్పటి నుంచి  ప్రతిరోజు మద్యం సేవించి వస్తూ  హల్ చల్ చేస్తున్నాడని, తెలుసుకున్నటువంటి గ్రామ సర్పంచ్ నరసింహమూర్తి  ఉపాధ్యాయున్ని అడ్డుకొని స్కూల్ బయటకు గెంటేశాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పే నువ్వే ఇలా సోయి తప్పి పడిపోతే ఎలా అంటూ ప్రశ్నించాడు.

 గత కొద్ది రోజులుగా  ఉపాధ్యాయుడు  కామరాజు  ఆలోచనల్లో  మార్పు వచ్చిందని, పాఠశాల విధినిర్వహణలో కూడా అలసత్వం వహిస్తున్నారని, ఎన్నిసార్లు హెచ్చరించినా అతడిలో మార్పు కనిపించడం లేదని, అందుకే స్కూల్ నుంచి గెంటేశాం అని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఈ ఉపాధ్యాయుడు  అక్కడి విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయాల్సింది పోయి  ఇలా చేయడం చాలా అమానుషమని అన్నారు. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలలో  ఉన్నతాధికారులు పర్యవేక్షించడం పోవడం వలనే ఇలా జరుగుతుందని మండిపడ్డారు. ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకొని మరొక ఉపాధ్యాయుని ఆ పాఠశాలకు నియమించాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: