నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఖాళీలు..

Purushottham Vinay
నిరుద్యోగులకు శుభవార్త. ఇక దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 6,229 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించడం జరిగింది.సెంట్రల్ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వర్సీటీల వీసీలను ఆదేశించడం జరిగింది.ఇక ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను ఈ నెల 10లోగా విడుదల చెయ్యాలని .. అక్టోబరు నెల చివరి లోపు నియామక ప్రక్రియ అనేది ముగించాలని పేర్కొనడం జరిగింది. ఇక సెంట్రల్ యూనివర్సిటీల వీసీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ మేరకు వెల్లడించడం జరిగింది.

ఇక కేటగిరీల వారీగా పోస్టుల ఖాళీల వివరాలు చూసినట్లయితే..
ఓబీసీ కేటగిరికి - 1,767 పోస్టులు ఖాళీలు వున్నాయి.
ఎస్సీ - 1,012 ఖాళీలు
ఎస్టీ - 592 ఖాళీలు
ఈడబ్ల్యూఎస్ - 805 ఖాళీలు
దివ్యాంగులు - 355 ఖాళీలు

అలాగే మాతృ భాషకు అదనంగా ఒక విదేశీ భాష ఉండాలి.ఇక కొత్తగా వచ్చిన విద్యా విధానం కింద మన భారతీయ భాషలకు ఇక  ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపడం జరిగింది. ఇక అలాగే నూతన విద్యా విధానాన్ని వినూత్న రీతిలో అమలు చేయాల్సిన బాధ్యత కూడా పూర్తిగా యూనివర్సిటీలదే అని ఆయన చెప్పడం జరిగింది. ఇక అలాగే సమయానికి తగ్గట్లుగా కోర్సుల్లో అప్‌డేట్ చేయాల్సిన బాధ్యత వర్సిటీలదేనని కూడా ఆయన తెలిపడం జరిగింది. అలాగే మన విద్యార్థులకు మాతృ భాషతో పాటు కనీసం ఏదైనా ఒక విదేశీ భాషను నేర్చుకునేలా తీర్చిదిద్దాలని సూచించడం జరిగింది.ఇక దీని వల్ల ఆ దేశాలకు వెళ్లే విద్యార్థులకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: