కలల భారతం: అందరికీ నాణ్యమైన విద్య..?

Pulgam Srinivas
మన దేశానికి స్వతంత్రం వచ్చి నేటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఎంతోమంది మహానుభావులు చేసిన ప్రాణ త్యాగాలకు గుర్తుగా మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి, జైలు గోడల మధ్య బందీలుగా జీవించి, చివరిగా ప్రాణాలను సైతం చిరునవ్వుతో అర్పించింది ఈరోజు కోసమే. మరి ఆ మహానుభావులు దేశానికి స్వతంత్రం వచ్చినట్లయితే ప్రజలందరూ ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు, దేశ ప్రజలందరికీ మెరుగైన వైద్యం , విద్య అన్ని కనీస వసతులు అందుతాయి అని కూడా కలలు కన్నారు. మరి ఆ మహానుభావులు కన్న కలలు అన్నీ  నిజం అయ్యాయా అంటే.. ఏమీ చెప్పలేని పరిస్థితి.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులు కన్న కలలలో ఒక ముఖ్యమైనది అందరికీ విద్యను అందించడం. దేశ ప్రజలందరికీ మెరుగైన విద్యను అందించడం ద్వారానే మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని వారు భావించారు.

 కానీ ప్రస్తుతం అది జరుగుతుందా అంటే.. జరుగుతుంది అని చెప్పలేం...జరగట్లేదు...అని కూడా చెప్పలేం...ఎందుకంటే పట్టణాల్లో మరియు  అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో మెరుగైన విద్య ప్రభుత్వం ద్వారా లేదా ప్రైవేటు సంస్థల ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు బాగానే అందుతుంది. కానీ మారుమూల గ్రామాల్లో నివసించే ప్రజలకు మెరుగైన విద్యా వసతులు లేకుండా ఉన్నాయి. మెరుగైన విద్య కోసం వారు కాలినడకన ప్రయాణం చేయవలసిన అవసరం కూడా ఉంది. మరి కొండకోనల ప్రాంతంలో ఉన్న  పిల్లలకు మెరుగైన విద్య దొరకడం చాలా అరుదు అనే చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం వారు కాలినడకన నడవడం మాత్రమే కాకుండా కొండలను, గుట్టలను దాటుకుంటూ  పాఠశాలలకు వెళ్ళవలసి వస్తుంది. ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులను దాటి అక్కడి ప్రజలు మెరుగైన విద్యను అందుకోవడం చాలా కష్టం అవుతుంది. మరి ఇకనైనా ప్రభుత్వాలు వారికి మెరుగైన విద్యను అందించడానికి కృషి చేయాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: