హేట్ యూ క‌రోనా : స‌దువెట్టా !

RATNA KISHORE
హేట్ యూ క‌రోనా : స‌దువెట్టా!  
అంద‌మ‌యిన బాల్యానికీ
అంద‌మ‌యిన జ్ఞాప‌కానికీ
బ‌డి మాత్ర‌మే వేదిక
న‌వ్వుల్లో కేరింత‌ల‌లో
ఆట పాట‌ల తుళ్లింత‌ల్లో
మ‌ట్టి పూసుకుంటే  
ఆ ఆనందం ఇంటి వ‌ర‌కు
మ‌ళ్లీ ఇంటి నుంచి బ‌డి వ‌ర‌కు
కొత్త పుస్త‌కాలు తెరిచేందుకు
కొత్త అట్ట‌లు వేసేందుకు
అస‌లు స‌మ‌యమే తెలియ‌కుండా
బ‌డి లో గ‌డిపేందుకు అస్స‌లు బిడ్డ‌ల‌కు
అవ‌కాశమే లేదు ఈ పాపం క‌రోనాది
బ‌డి అనే భావోద్వేగ ప్రాంగ‌ణం నుంచి పిల్ల‌లు దూరం అయిన‌ప్ప‌టికీ ఇంకా ఎన్ని రోజులు ఈ సంక‌ట స్థితి అన్న‌ది తేల‌న‌ప్ప‌టికీ ఎ ప్ప‌టిక‌ప్పుడు టీచ‌ర్లు కొత్త ఆశ‌లు పెంచుకుంటున్నారు.త‌మ ఒడిలో ఆడుకునే బుజ్జాయిల రాక కోసం ఎదురు చూస్తున్నారు. కా నీ క‌రోనా అనే అడ్డు గోడ లేకుండా ఉంటే ఇప్ప‌టికే కొన్ని న‌వ్వుల జ‌ల‌పాతాలు ప‌చ్చని నేల‌పై  సంద‌ళ్లు చేసేవే! కానీ ఈ సారి కూ డా చ‌దువులు అట‌కెక్కించేలానే ఉంది క‌రోనా! టీకాల ఉత్పత్తి పంపిణీ అన్న‌ది ఇంకా పూర్తి కానుందున గ్రామాల్లో మారుమూ ల ప్రాంతాల్లో ర‌క్ష‌ణ చర్య‌లు పెద్ద‌గా లేనందున బ‌డులు ఇప్ప‌ట్లో తెరుచుకున్నా చిన్నారులు లేని త‌ర‌గ‌తి గదులు.. ఏ రాత‌లూ లేని న‌ల్ల బ‌ల్ల‌లూ త‌ప్ప‌క క‌నిపిస్తాయి.


చ‌దువుల బ‌డి ఏదీ లేదు..
అన్నీ డిజిట‌ల్ త‌ర‌గ‌తులే
అవి కూడా కొంద‌రివే
లేదు కొంద‌రికే
ఈ నేప‌థ్యంలో

 
కొత్త ఏడాది అన్న‌దే లేదు..అన్నీ పాత రోజులే.. కొత్త బ‌ట్ట‌లూ కొత్త పుస్త‌కాలు..అస్స‌లు లేనే లేవు..కాలం ఇంత‌టి దూరం పెంచు తుంద‌న్న ఊహ ఆ బుజ్జాయిలకు లేనేలేదు.. ఏడాదిగా చ‌దువు డిజిట‌ల్ అయిపోయింది. ని ర్మ‌లా మిస్ ఎక్క‌డున్నారో.. సుజాత టీచ‌ర్ ఎక్క‌డున్నారో పాపం వారికి తెలియ‌నే లేదు.. ఆన్లైన్ చ‌దువు వ‌ద్దు మొర్రో అంటున్నారా..కానీ త‌ల్లిదండ్రులు వినిపించుకో రు.. ఈ త‌రుణాన ఆగ‌స్టు 16 నుంచి మ‌ళ్లీ కొత్త విద్యా సం వ‌త్స‌రం ఆరంభం కానుంది.కానీ పిల్ల‌ల‌కూ,బ‌డికీ మ‌ధ్య దూరం మాత్రం అలానే ఉంది. నాడు నేడు కార్య‌క్ర‌మంలో భాగంగా పాఠ‌శాల‌ల‌కు పూర్వ వైభవం ద‌క్కిన‌ప్ప‌టికీ క‌రోనా భ‌యాలు ఇంకా అలానే ఉన్నాయి.కొత్త వేరియంట్ల పుణ్య‌మాని హ‌డ‌లిపోతున్నారు త‌ల్లిదండ్రులు. ఈ నేప‌థ్యంలో చ‌దువులు సాగేదెలా?
వ్యాక్సీన్  వేయించినా
భ‌యాలు పోవ‌డం లేదే!
ఇప్ప‌టికే ఉపాధ్యాయుల‌కు వ్యాక్సీన్ వేయించేందుకు ప్ర‌భుత్వం కొన్ని చ‌ర్య‌లు చేప‌ట్టింది.అదేవిధంగా పిల్ల‌ల‌కూ టీకాలు త్వ‌ర‌లో రానున్నాయి.ఇవ‌న్నీ అందుబాటులోకి వ‌చ్చాక వ్యాక్సినేష‌న్ జ‌రిగాక మ‌న పిల్ల‌లు బ‌డికి పోవ‌డం అన్న‌ది ఖాయ‌మ‌ని తేలిపో యింది.గ‌తంలో కొన్ని చోట్ల బ‌డులు తెరిచిన‌ప్ప‌టికీ క‌రోనా విజృంభించండంతో  వెంట‌వెంట‌నే ఆయా పాఠ‌శాల‌లు మూత‌ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో చ‌దువులు సాగాలంటే పూర్తి స్థాయిలో క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాలి.కానీ ఇప్ప‌టికిప్పుడు ఇవి సాధ్యం అ య్యేలా లేవు. ముఖ్యంగా వ్యాక్సీన్ కొర‌త వెన్నాడుతోంది.కొన్ని ఇంకా ప్ర‌యోగ‌ద‌శ‌లోనే ఉన్నాయి.కొన్ని ఇంకా విడుద‌ల‌కు ముందు చేప‌ట్టే స‌న్నా హ‌క ప‌రీక్ష‌ల్లో ఉన్నాయి. వెస్ట్ర‌న్ సొసైటీ కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటోంది. ఇప్పుడు టీకా రోగ నివారిణి కాకున్నా కాస్త‌యినా అడ్డుకునే ఆ నిరోధ‌కం క‌నుక బ‌డులు మ‌ళ్లీ పూర్వ క‌ళ‌లను తెచ్చుకోవాలంటే క‌రోనా నియంత్ర‌ణ‌కు సంబంధించి ప్ర‌భుత్వాలూ,ప‌రిశోధ‌కులూ చేప‌ట్టే చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: