ఓవ‌ర్ టు స్పీక‌ర్ : మంచి పాఠ‌శాల‌ను చూశాను

RATNA KISHORE
ఓవ‌ర్ టు స్పీక‌ర్  : మంచి పాఠ‌శాల‌ను చూశాను
బ‌డులన్నీ ఎలా ఉన్నాయి
స‌ర్కారు బ‌డికి చిన్న చూపు పోయి
పెద్దరికం వ‌చ్చేసింది
హుందాత‌నం నేర్చేసింది
అబ్బా! బ‌డి అంటే ఇలా ఉండాలి అనేందుకు
తార్కాణం అయి ఠీవిగా నిల్చొంది
ప‌చ్చని చెట్లు కొన్ని పాడే కోయిల‌లూ కొన్ని
చ‌దువుల కోవెల‌లో వింటూ పోతూ ఉన్నాను
ఆనందించేను నేను ఆనందించాలి మీరు
విరిగిన బెంచీలు.. పెచ్చులూడిన గచ్చులు
ఇవేవీ లేవిక్క‌డ.. హాయిగా  చ‌దువుకునేందుకు
దారి.. త్వ‌ర‌లో బ‌డి గంట వినిపిస్తే .. పోదాం రండి అటు వైపు
శ్రీ‌కాకుళం జిల్లా ఆమదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో నాడు -  నేడు అమలులో భాగ‌మిది. ఈ ప‌థ‌కం వ‌చ్చాక బ‌డి రూపు మారి పోయింది. మొత్తం 96 బ‌డుల‌కు గాను 34 బ‌డుల‌ను ఎంపిక చేసి వాటిని తీర్చిదిద్దుతున్నారు ఇక్క‌డి విద్యాశాఖ అధికారులు.. బ‌డి రూపు మారంగానే పిల్ల‌ల హాజరు శాతం పెరిగింది. డ్రాపౌట్లూ త‌గ్గారు. స‌ర్కారు బ‌డికి కార్పొరేట్ హోదా ఇచ్చారు సీఎం జ‌గ‌న్ అని మురిసిపోతున్నారు ఇక్క‌డి స్థానిక ప్ర‌జానికం. స్పీక‌ర్ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో రాష్ట్రం దృష్టి కూడా ఇటే ఉంది.త‌మ్మినేని సైతం త‌న ప‌రిధిలో ఉన్న నాలుగు మండ‌లాలలో ఉన్న పాఠ‌శాల‌ల అభివృద్ధికీ  తగు ప్రాధాన్యం ఇచ్చారు. నియోజ‌క వ‌ర్గ కేంద్రం ఆమ‌దాల‌వ‌ల‌స‌తో  స‌హా పొందూరు, బూర్జ‌, స‌రుబుజ్జిలి మండ‌లాల పాఠ‌శాల‌ల రూపు మార్పున‌కు ప్ర‌ణాళిక‌లు రూ పొందింప‌జేశా రు. మౌలిక వ‌స‌తుల కల్ప‌న, తాగునీరు, శుభ్ర‌మ‌యిన టాయిలెట్లు, బెంచీల‌తో కూడిన త‌ర‌గ‌తి గ‌దులు, పచ్చిక నిండిన ఆట‌స్థ‌లం  ఇవే ప్రాధాన్యాంశాలుగా నాడు నేడు ప‌థ‌కంలో భాగంగా బ‌డులు కొత్త హంగులు స‌మ‌కూర్చుకున్నాయి. వ‌చ్చే నెల 16 నుంచీ బ‌డి గంట‌లు వినిపించే నేప‌థ్యంలో ఇంకొన్ని ప‌నులు పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా పూర్తి కానున్నాయి. ప్ర‌స్తుతం వీటిపైనే యంత్రాంగం దృష్టి సారించింది. ప్ర‌భుత్వ బ‌డుల్లో మంచి వాతావ‌ర‌ణంలో పాఠాలు బోధించడం, ఉత్తీర్ణ‌తా శాతం పెంచ‌డం, అలానే మ‌ధ్యాహ్న  భోజ‌న ప‌థ‌కం అమలులో భాగంగా నిర్దేశిత ప్ర‌మాణాల మేర‌కు స‌మ‌తుల ఆహారం అందించడం అన్నవి ఇవాళ త‌మ ముందున్న  ప్రాథాన్యాంశాలు అని అక్క‌డి విద్యాశాఖ అధికారులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: