భారీగా తగ్గిన ఇంజినీరింగ్ సీట్లు.. ఎందుకంటే..?

Purushottham Vinay
కరోనా వైరస్ ప్రభావంతో దేశంలోని అన్ని రంగాలు కుదేలవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఐఐటి-హైదరాబాద్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. ఓవైపు కొత్త కాలేజీలు ఏర్పాటు కాకపోవడం, మరోవైపు కొన్ని కాలేజీలు డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవడంతో ఇంజినీరింగ్ సీట్లు గణనీయంగా తగ్గాయి.విద్యా వ్యవస్థపై కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చాలా ఎక్కువగా పడింది. కరోనా మహమ్మారి దెబ్బకు స్కూళ్లు, కళాశాలలు నడపలేక ఏకంగా విద్యాసంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇక మరోవైపు విద్యార్థులు కూడా మంచి ఫీచర్ ఉన్న కోర్సుల్లోనే చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక దీంతో ఇంజినీరింగ్ కాలేజీలు డిమాండ్ లేని కోర్సులను వెంటనే రద్దు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో ఇంజినీరింగ్ సీట్లు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఈ) వెల్లడించడం జరిగింది.

ఇక గత పది సంవత్సరాలలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగే డిప్లొమా స్థాయిలలో ఇంజినీరింగ్ సీట్లు 23.28 లక్షలకు తగ్గడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా మొత్తం 63 ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడటం జరిగింది.ఇక ఈ కారణంగా 2‌021లోనే మొత్తం 1.46 లక్షల సీట్లు తగ్గిపోయాయట. ఇంజినీరింగ్ సీట్లు అనేవి గణనీయంగా పడిపోయినప్పటికీ టెక్నికల్ ఎడ్యుకేషన్లో 80 శాతం సీట్లతో ఇప్పటికీ ఇంజినీరింగ్దే పైచేయి కావడం విశేషంగా చెప్పుకోవాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్లోని ఆర్కిటెక్చర్ ఇంకా మేనేజ్‌మెంట్ మరియు హోటల్ మేనేజ్‌మెంట్ ఇంకా ఫార్మసీతో పోలిస్తే ఇంజినీరింగ్ చదివే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం.ఇక ఈ సంవత్సరం 63 కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి నిరాకరించడం జరిగింది. ఇక దీంతో మరో 63 కాలేజీలు మూతపడనున్నాయి.ఇక చాలా కాలేజీల్లో కూడా నాణ్యమైన విద్య అనేది లేకుండా చాలా మంది విద్యార్థులు బిటెక్ అవ్వగానే నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: