మగువా ఓ మగువా ఈ లోకానికి తెలుసా నీ విలువ అని ఆ రచయిత ఊరికే రాయలేదు. మహిళా తలుచుకుంటే ఏదైనా సాధించగలదని ప్రస్తుతం ఉన్న సమాజంలో నిరూపణ అవుతోంది. అమ్మతనం నుంచి అంతరిక్షం వరకూ అమ్మాయిలు తమ సత్తా చాటుతున్నారు. మగవారితో ఎక్కడ తీసుకోకుండా ఓ మెట్టు పైనే ఉంటున్నారు. ఈ వృత్తిలో కూడా మహిళలదే టాప్ లో నిలిచిందని చెప్పవచ్చు. అది ఏంటో చూద్దామా..? పిల్లలకు అమ్మే ఆది గురువు. లోకాన్ని అర్థం చేసుకోవడానికి చూపించేది కూడా తల్లి. అలాంటి అమ్మలే బావి భారత పౌరుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఏటేటా పురుషుల కంటే మహిళా టీచర్లే అధికంగా పెరగటం విశేషం.
రాష్ట్రంలోని అన్నిరకాల యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలను కలిపి 3,05,597 మంది టీచర్లు ఉండగా 1,73,926 మంది మహిళా టీచర్లు ఉన్నారని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. 2019 -20 సంవత్సరానికి యునైటెడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఆప్ ఎడ్యుకేషన్ నివేదికను కేంద్ర విద్యా శాఖకు అందించింది. తెలంగాణలో ప్రాథమిక విద్య నుంచి అన్ని స్థాయిల్లో మహిళా టీచర్ల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ప్రాథమిక విద్యలో ఎక్కడ 90 శాతం మహిళా టీచర్లు ఉన్నారన్నది. సెకండరీ స్కూల్ లలో పురుషులు మహిళ టీచర్ల నిష్పత్తి సమానంగా ఉండగా, హయ్యర్ సెకండరీ స్కూల్ లలో పురుషుల్లో అధికంగా ఉన్నారు. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచింది. అన్ని స్థాయిల్లోనూ జాతీయ సగటుతో పోల్చుకున్నా విద్యా హక్కు చట్టంతో పోల్చిన మహిళా టీచర్లు అధికంగా ఉండడం విశేషం.
జాతీయ ప్రాథమిక స్థాయిలో 26.6 శాతం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, 18.5 శాతం సెకండరీ లో,18.5 శాతం హయ్యర్ సెకండరీ లో ఉన్నారు. ఏ స్థాయిలో తీసుకున్న తెలంగాణలో తక్కువ మంది విద్యార్థులకు ఎక్కువ టీచర్లతో ఉపాధ్యాయ నిష్పత్తి మెరుగ్గా ఉండటం గమనార్హం. డ్రాప్ అవుట్ తగ్గింపులో కూడా తెలంగాణ రాష్ట్ర మెరుగ్గా ఉందని కేంద్ర విద్యా శాఖ తెలిపింది.