ప్రతిభకు తోడుగా "విద్యాలక్ష్మి"

MOHAN BABU
 ప్రస్తుతం  ఉన్నత చదువులు చదవాలి అంటే లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి. ప్రతిభ ఉన్నా ఆర్థిక స్థోమత లేక చదువుకు దూరం అయ్యే వారు ఎంతో మంది. విద్యార్థుల ప్రతిభ దేశ భవిష్యత్తుకు పెట్టుబడి , అందుకని ప్రతిభకు పేదరికం అడ్డురాకుడదని  కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకం ద్వారా బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం అందజేస్తుంది. మనదేశంలో  విదేశాల్లో చదువుకునే  విద్యార్థులకు  రుణ రూపంలో ఇచ్చే నగదు మొత్తమును  చదువు పూర్తయిన వెంటనే చెల్లించే వెసులుబాటు ఉండడం  ఎంతో ఉపయోగకరం.

 **ఏ  కోర్సులకు బ్యాంకు లోన్ ఇస్తుంది**
విద్యార్థులు  ప్రతిభావంతులై ఉండాలి. మంచి ర్యాంకులు సాధించి ఉండాలి.  విద్యార్థి ఎంత చురుగ్గా ఉన్నాడు అనేదానిపై నీకిచ్చే రుణం ఆధారపడి ఉంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, హోటల్ మేనేజ్మెంట్, నర్సింగ్ తదితర కోర్సులకు ఆయా విశ్వవిద్యాలయాన్ని బట్టి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. అంటే  విదేశాల్లో విద్యను అభ్యసించాలంటే అంతర్జాతీయ స్థాయి ర్యాంకులు ఉన్న యూనివర్సిటీలో  సీట్లు పొంది ఉండాలి.

 **రుణాలు ఇచ్చే బ్యాంకులు**
 విద్య లక్ష్మి పథకం కింద  ఎస్బిఐ, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యు బి ఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ లాంటి తదితర 13 వాణిజ్య స్థాయి బ్యాంకులు రుణాలు  ఇస్తున్నాయి. దేశీయ విద్యకు  పది లక్షల వరకు, విదేశీ విద్యకు 15 లక్షల నుంచి 60 లక్షల వరకు రుణం మంజూరు చేస్తున్నాయి. ఎస్బిఐతో పాటు కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు హార్వర్డ్ విశ్వవిద్యాలయం లాంటి పేరుగాంచిన విద్య సంస్థల్లో చదవాలనుకునే వారికి గరిష్టంగా 1.5 కోట్ల వరకు  రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 4.5 లక్షల లోపు ఉన్న  విద్యార్థులు రుణం తీసుకుంటే  వడ్డీ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.

 **రుణం తిరిగి చెల్లించే విధానం **
 విద్యార్థి  చదువు పూర్తయిన ఈ ఏడాది తర్వాత నుంచి అసలు, వడ్డీతో కలిపి బ్యాంకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్లలో వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. చదువు కొనసాగుతుండగానే తల్లిదండ్రులు ఆదాయాన్ని బట్టి  చెల్లింపులు చేస్తే రుణ భారం తగ్గుతుంది. ఇది విద్యార్థి తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: