సిమెంట్‌ కార్పొరేషన్‌లో 46 జాబ్స్‌... డిగ్రీ, ఇంజనీరింగ్ అర్హత..

Satvika
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉద్యొగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ లను విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఉద్యొగాల భర్తీ చేస్తోంది. తాజాగా మరో కంపెనీ నోటిఫికెషన్ ను విడుదల చేసింది. సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 46 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందు లో ప్రొడ‌క్ష‌న్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, మైనింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌, హ్యూమ‌న్ రిసోర్స్‌, కంపెనీ సెక్రెట‌రీ, రాజ్‌భాష అధికారి, లీగ‌ల్ పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు చివరి తేదీగా జూన్ 30 అని పేర్కొన్నారు.



ఇంజినీరింగ్‌, డిగ్రీ పూర్తి చేసిన‌ విద్యార్థులు ఈ ఉద్యొగాల కు అప్లై చేసుకొవచ్చు.. పోస్టుల కు ఎంపికైన అభ్యర్థులు తాండూర్‌, బొక‌జాన్‌, రాజ్‌బ‌న్‌, క‌ర్పొరేట్ ఆఫీస్‌ల‌ లో ప‌నిచేయాల్సి ఉంటుంది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతి ప‌దిక‌న ఉద్యోగాల‌ ను భ‌ర్తీ చేస్తున్నారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కు https://www.cciltd.in/ వెబ్‌ సైట్‌ చూడొచ్చు. అప్లై చేసుకోవడాని కి ముందే నోటిఫికెషన్ ను పూర్తిగా చదవాలి.. 


ఈ ఉద్యొగాల కు సంబంధించిన పూర్తి సమాచారం..


మొత్తం ఖాళీలు- 46

ఇంజనీరింగ్- 29

ఆఫిసర్- 17

అర్హతలు.. 

పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌, డీగ్రీ, పీజీ ఉత్తీర్ణు లై ఉండాలి. అనుభ‌వం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

వయసు.. 

మే నెలకు 35 ఏళ్ళు మించకూదదు..
ద‌ర‌ఖాస్తు విధానం: 

ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: 

ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తుల‌ కు చివ‌రి తేదీ: జూన్ 30, 2021

వెబ్‌సైట్‌: https://www.cciltd.in/

ఈ ఉద్యొగాల కు ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిరుద్యోగులు ముందుగా నోటిఫికేషన్ ను ఒకటికి పదిసార్లు చదివి అప్లై చేసుకోవాలి....గతం లో విడుదలైన నోటిఫికెషన్ ద్వారా చాలా మంది ఉద్యొగాల ను పొందారు.. ఇప్పుడు కూడా ఈ నోటిఫికెషన్ తో కొందరైన ఉద్యొగాలను పొందుతారని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: