మరో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా మలంజ్కంద్ లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ విభాగంలోని ఎలక్ట్రీషియన్ గ్రేడ్, ఎలక్ట్రీషియన్ కం లైన్ మెన్ గ్రేడ్ తదితర పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఐటీఐ,ఎన్సీవీటీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు..అభ్యర్థులకు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో పాటు మూడేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. వయో పరిమితిగా 35 ఏళ్లు నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18,180 నుంచి రూ. 37,310 వరకు వేతనం చెల్లించనున్నారు.ఈ ఉద్యోగాలకు కూడా ఐటీఐ అర్హత కలిగిన వారు అర్హులు. వైర్ మెన్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల కు 18, 180 నుంచి రూ. 37, 310 చెల్లించనున్నారు. ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 15లోగా తమ దరఖాస్తులను పంపించాలి.. పూర్తి వివరాలను కంపెనీ వెబ్ సైట్ లో చూసి అప్లై చేసుకోవాలి..