ఏపీ లోని నిరుద్యోగులకు, విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ లో ప్రత్యేక పనులు కోసం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ పై ఎవరు ఎన్ని విధాలుగా అంటున్న కూడా జగన్ సర్కార్ వెనకడుగు వేయలేదు. వాలంటీర్ల వ్యవస్థ ను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఇందులో భాగంగా మంచిగా చేసిన వారికి అవార్డుల ను కూడా అందించారు.
అంతేకాదు ఇటీవల వాలంటీర్లను ఇంకా తీసుకునేందుకు నోటిఫికేషన్ ను సర్కార్ విడుదల చేసింది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అత్యంత చేరువ చేయాలన్న లక్ష్యం తో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ను తీసుకువచ్చింది. లక్షలాది మంది నిరుద్యోగుల కు ఈ వాలంటీర్ వ్వవస్థ ద్వారా ఉపాధి సైతం లభిస్తోంది. వివిధ జిల్లాల్లో ఏర్పడుతున్న వాలంటీర్ పోస్టుల ఖాళీల ను అధికారులు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 2268 వాలంటీర్ పోస్టు ల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1006, చిత్తూరులో 569, ప్రకాశం జిల్లాలో 296, శ్రీకాకుళం జిల్లాలో 397 ఖాళీలు ఉన్నాయి.ఈ పోస్టుల కు అర్హత టెన్త్ లేదా ఇంటర్ పాసై, ఆయా గ్రామ, వార్డు పరిధిలో నివసిస్తూ ఉండే అభ్యర్థులు ఈ పోస్టుల కు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-35 ఏళ్ల మధ్య లో ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలు, ఇతర స్కిల్స్ కు 25 చొప్పున మార్కులు కేటాయించనున్నారు. https://apgv.apcfss.in/notificationPublicReport.do అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/ వీటి ద్వారా పోస్టు ల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు.