టేకీలకు బంఫర్ ఆఫర్.. ఆ కంపెనీలలో వేతనాల పెంపు..

Satvika
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభస్తున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈమేరకు ప్రముఖ మల్టి నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఈ ఏడాది కూడా పర్మినెంట్ చేస్తున్నారు. ఇంటి  దగ్గర నుంచి పని చేసేందుకు అన్ని రకాల వెసులుబాటును కల్పించారు. అయితే, గత ఏడాదిలో జీతాల పెంపుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. ఆ విషయం పై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది ఐటీ దిగ్గ‌జాలు ఇప్ప‌టికే వేత‌నాల పెంపును వ‌ర్తింప‌చేయ‌డంతో పాటు నైపుణ్యం తో కూడిన మాన‌వ వ‌న‌రుల‌ ను నిలుపుకునేందుకు ప‌లు కేడ‌ర్ల‌ లో డ‌బుల్ హైక్స్ ను వ‌ర్తింప చేయ‌డం తో టెకీల్లో జోరు నెల‌కొంది. వేత‌న పెంపు తో పాటు ప్ర‌మోష‌న్ల‌నూ ప‌లు ఐటీ కంపెనీలు ఆఫ‌ర్ చేస్తున్నాయి. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో ఇంక్రిమెంట్లు ఇచ్చిన యాక్సెంచ‌ర్ ఇండియా ఫిబ్ర‌వ‌రి లో మ‌రోసారి వేత‌న పెంపును చేప‌ట్టింది. అసోసియేట్ డైరెక్ట‌ర్ స్థాయి వ‌ర‌కూ ఒన్ టైమ్ థ్యాంక్యూ బోన‌స్ ను అంద‌ చేశామని యాక్సెంచ‌ర్ ఇండియా ప్ర‌క‌టించిన‌ట్టు ఓ జాతీయ‌ వార్తా సంస్థ వెల్ల‌డించింది.
గ‌త ఏడాది ఎంప్లాయిస్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా జులై నుంచి తాజా వేత‌న పెంపు వ‌ర్తింప‌ చేసేందుకు క‌స‌ర‌త్తు సాగుతోంద‌ని చెప్పారు. రెండు ఇంక్రి మెంట్లు క‌లుపుకుని 10 నుంచి 14 శాతం వ‌ర‌కూ వేత‌న పెంపు ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇక ఆరు నెల‌ల వ్య‌వ‌ధి లో టీసీఎస్ రెండు సార్లు ఇంక్రిమెంట్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో అసోసియేట్లు అంద‌రికీ టీసీఎస్ వేత‌న పెంపును ప్రకటించింది. విప్రో, మైక్రో సాఫ్ట్, డెల్ వంటి ఐటీ కంపెనీలు జూన్ జీతాల పెంపు పై ను అమ‌లు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఏప్రిల్ నుంచి టెక్ మహీంద్ర జీతాలను పెంచినట్లు వెల్లడించింది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: