ఎస్టీటీ పోస్టుల లెక్క తేల్చిన విద్యాశాఖ..ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయంటే.?
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహిస్తామని చెప్పడంతో నిరుద్యోగుల్లొ డీఎస్సీ పై ఆశలు చిగురించాయి. ఇటీవల చేసిన టీచర్ల సర్దుబాటుతో ఎక్కువ మొత్తంల ఏకోపాద్యాయ పాఠశాలలు ఏర్పాడ్డాయి. అంతే కాకుండా ఈ ఏడాది దాదాపు మరో నాలుగు లక్షలమంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. విద్యార్థుల సంఖ్య పెరిగి ఉపాధ్యాయుల సంఖ్య తగ్గితే భోదన కుంటుపడే అవకాశం ఉంది. మరోవైపు రానున్న రెండేళ్లలో సుమారు 7500 ఉపాధ్యాయులు ఉద్యోగవిరమణ చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఇక జిల్లాల వారిగా పోస్టుల వివరాలు చూసుకుంటే...శ్రీకాకులం జిల్లాలో 862, విజయనగరం 832, విశాఖపట్నం 1165, తూర్పుగోదావరి జిల్లాలో 1490, పశ్చిమగోదావరి 1390, కృష్ణా జిల్లా 1094, గుంటూరు 911, నెల్లూరు 1256, ప్రకాశం 796, కడప 807, చిత్తూరు 2552, అనంతరపురం 467, కర్నూలులో 506 పోస్టులు ఉన్నాయి.