త్వరలో 10 వేల టీచర్ పోస్టులు..!

Divya

 ప్రస్తుతం ఎంతో మంది విద్యావలంటీర్లు గా పని చేస్తున్నారు.. అలాంటి వారి కల సాకారం చేసుకునేందుకు ప్రభుత్వ 10,673 టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఎంతో కష్టపడి చదివి, ఎన్నో ప్రయత్నాలు చేసి,ఉద్యోగం సాధించక నిరాశ పడి ఉంటారు. ఇప్పుడు అలాంటి వారి ఆశ మళ్లీ చిగురించేలా ప్రభుత్వం ఒక శుభవార్త ను తీసుకొచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో 2, 264 మంది రిటైర్డ్ తీసుకోనున్నారు. కాబట్టి ఈ పోస్టులను భర్తీ చేయడం కోసం, అదనంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం ప్రభుత్వం నిరుద్యోగులకు ఊరట ను ఇచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే పాఠశాల విద్యాశాఖలో పదవి విరమణ తో మొత్తం 10,673 టీచర్ పోస్టులు ఖాళీ అయినట్లు విద్యా శాఖ అంచనా వేసింది. అందులో అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉండగా, మిగతావి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, హెడ్మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అయితే వాటన్నింటినీ డైరెక్టుగా రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం లేదు.. అందులో ఆరు వేలకు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను డైరెక్టుగా రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇక మిగతావి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఖాళీల్లో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా 30 శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరో  2,264 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తుండగా, అందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 199 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్నట్టు తెలిపింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా నుంచి 186 మంది, సంగారెడ్డి నుంచి 152  మంది, సిద్దిపేట నుంచి 139 మంది, నిజామాబాద్ నుంచి 136 మంది, వరంగల్ అర్బన్ నుంచి 106 మంది, కరీంనగర్ నుంచి 99 మంది, ఇక మిగతా వాటిలో ఒక్కో జిల్లాలో ఎనిమిది మంది నుంచి 99 మంది లోపు టీచర్లు పదవీవిరమణ చేస్తున్నట్లు తెలిసింది... అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: