పదోతరగతి పాస్ అయ్యారా? అయితే మీకు ఉద్యోగం గ్యారెంటీ..

Satvika
పదోతరగతి పాసై చాలా మంది కొన్ని రకాల సమస్యల వల్ల చదువును మధ్యలోనే ఆపేస్తారు. అయితే, ఏదైనా చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే బాగుండు అని భావిస్తారు. ప్రస్తుత రోజుల్లో పదోతరగతి పాస్ అయ్యారు అంటే చిన్న ఉద్యోగాలు కూడా రావడం లేదు. అలాంటి వాళ్ళు దిగులుపడకండి.. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులు చాలాకాలంగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న సంగితి తెలిసిందే. మొత్తానికి నోటిఫికేషన్ వచ్చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 



అప్లై చేయడానికి 2021 మార్చి 21 చివరి తేదీ. ఖాళీల వివరాలను ప్రకటించలేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో ఖాళీల వివరాలను అప్‌డేట్ అవుతాయి. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత కార్నర్ సెక్షన్ లో టేనెంటివ్ వేకెన్సీ పై క్లిక్ చేయాలి.గతంలో మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ ద్వారా 9069 పోస్టుల్ని భర్తీ చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC. ఈసారి కూడా అంతే సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయొచ్చు అని సమాచారం.



ఇకపోతే ఇందులో ఖాళీలు ఉన్న మొత్తం వివరాలు ఇవే.. 


మొత్తం ఖాళీలు- త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి


వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం- రెండు దశల పరీక్ష
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి..


నోటిఫికేషన్ విడుదల- 2021 ఫిబ్రవరి 5
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 5
అప్లికేషన్‌కు చివరి తేదీ- 2021 మార్చి 21 రాత్రి 11.30 గంటలు
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్‌కు చివరి తేదీ- 2021 మార్చి 23 రాత్రి 11.30 గంటలు
చలాన్ జనరేషన్‌కు లాస్ట్ డేట్- 2021 మార్చి 25 రాత్రి 11.30 గంటలు
చలాన్ పేమెంట్‌కు లాస్ట్ డేట్- 2021 మార్చి 29 బ్యాంకు వేళలు ముగిసేలోపు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్ 1)- 2021 జూలై 1 నుంచి జూలై 20
టైర్ 2 ఎగ్జామినేషన్- 2021 నవంబర్ 21 న ఉండనుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: