ఆ విషయంలో భయపడవద్దు.. విద్యార్థులకు ఏపి సర్కార్ భరోసా..

Satvika
కరోనా సమస్య పూర్తిగా తగ్గిపోయింది.. ఈ మేరకు స్కూల్స్ , కాలేజీలను తెరిచేందుకు ఆయా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పలు చోట్ల విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. గత ఏడాది వాయిదా పడిన అన్నీ కూడా ఈ ఏడాది గ్యాప్ లేకుండా జరిపించాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా పీజీ, ఇంటర్ విద్యార్థులకు మాత్రం వెంట వెంటనే క్లాసులు జరిపి పరీక్షలు కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ బోధనతో తాపీగా సాగిన ఇంటర్మీడియట్‌ చదువులు ఇప్పుడు తరగతుల ప్రారంభంతో ఉరుకులు పరుగులు అందుకున్నాయి. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలతోపాటు జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలు, పలు యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల సన్నద్ధతలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.


చాలాకాలం తరగతులు లేకుండానే గడిచిపోవడం, మిగతా సమయం తక్కువగా ఉండడంతో ఆయా విద్యాసంస్థలు కూడా త్వరగా సిలబస్‌ ముగించి రివిజన్‌ చేయించే సన్నాహాల్లో పడ్డాయి.ఫలితంగా విద్యార్థులు మానసికంగా ఇబ్బందిపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్‌ పరీక్షలతోపాటు ఎక్కువమంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరవుతుంటారు. ఈసారి జేఈఈపై విద్యార్థులు ఒత్తిడికి గురికావలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.


మాములుగా ఈ పరీక్షలను ప్రతి ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్ణయించారు. ఇప్పుడు ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు, మార్చి 15 నుంచి 18 వరకు, ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు, మే 24 నుంచి 28 వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. అయితే ఇప్పుడు ఈ పరీక్షలను ఎన్ని సార్లు రాసిన వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారని వెల్లడించారు.జేఈఈలో బీఈ, బీటెక్‌లకు పేపర్‌-1, బీఆర్క్‌కు పేపర్‌-2ఏ, బీ, ప్లానింగ్‌కు పేపర్‌-2బీగా మూడుపేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్‌-1లో మొత్తం 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. మొత్తం ప్రశ్నల్లో మ్యాథ్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీలలో ప్రతి పరీక్షలో 30 మార్కులు చొప్పున ఉంటాయని పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: