నావికాదళంలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోన్న ఇండియన్ కోస్ట్ గార్డ్!

Divya
పురుషులతో పాటు మహిళలు కూడా  నావికాదళంలో ఉద్యోగాలు చేయాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఉన్నత చదువులు అభ్యసించి, తమ కలలను సాకారం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివారి కోసమే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇప్పుడు ఒక శుభవార్త తీసుకొచ్చింది. ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్. అందులో ఉన్న ఉద్యోగాల భర్తీకి పిలుపును అందిస్తోంది.అయితే ఇందులో నావికాదళంతో పాటు యాంత్రిక్ ఈ విభాగంలోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ కోస్ట్ గార్డ్. మొత్తం 358 పోస్టులకు పిలుపునిస్తోంది. ఇందులో విద్యార్హత పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాసైనవారు అర్హులు. ఇందులో విభాగాల వారీగా జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్,మెకానికల్,ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రికల్ బ్రాంచ్ లోనూ  పోస్టులను భర్తీ చేస్తోంది.

ఇండియన్ కోస్ట్ గార్డ్ విడుదల చేసిన మొత్తం పోస్టులు-358
నావిక్ జనరల్ డ్యూటీ -260
నావిక్ డోమెస్టిక్ బ్రాంచ్ -50
యాంత్రిక్ మెకానికల్ -31
యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ -10
యాంత్రిక్ ఎలక్ట్రికల్  -7
ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ తో పాటు పూర్తి వివరాలు
https://joinindiancoastguard.cdac.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవడం తో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2021 జనవరి 19.

ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?
https://joinindiancoastguard.cdac.in/  అభ్యర్థులు ముందుగా ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత విద్యార్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
NAVIK (GENERAL DUTY), NAVIK(DOMESTIC BRANCH) AND YANTRIK 02/2021 BATCH అడ్వర్టైజ్‌మెంట్ సెలెక్ట్ చేయాలి.అందులో మీరు ఏ పోస్టుకు అర్హులో సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత i agree  బటన్ పై క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించాలి. ఇందులో అభ్యర్థి పేరు, అభ్యర్థి యొక్క తండ్రి పేరు, తల్లి పేరు,పుట్టిన తేది లాంటి వివరాలను నమోదు చేసుకోవాలి.
మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి.
ఫోటో,సంతకం అప్లోడ్ చేసి వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి.
సబ్మిట్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి.
ప్రాసెస్ పూర్తయిన తర్వాత దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని,ప్రింట్ తీసుకుంటే భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది.
అయితే ఈ పోస్టులకు సంబంధించి వేతనాలు ఏ విధంగా ఉంటాయి అంటే?
దరఖాస్తు ప్రారంభం తేదీ-  5 జనవరి  2021
దరఖాస్తు చివరి తేదీ-19 జనవరి 2021 సాయంత్రం 6 గంటల వరకు.
వయసు-18 నుంచి 22 ఏళ్లు.
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఇవ్వగా ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు ఇచ్చింది.
ఇక వేతనం విషయానికొస్తే  నావిక్ పోస్టుకు -రూ.21,700/-+DA+ ఇతర అలవెన్సులు లభిస్తాయి.
యాంత్రిక్ పోస్టులకు -రూ.29,200/-+DA+ ఇతర అలవెన్సులు.
పోస్టులకు సంబంధించిన అన్ని వివరాలు అప్లోడ్ చేయడం జరిగింది. అభ్యర్థులు వీటిని చూసి గడువు ముగియకముందే అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: