CBSE: రాత విధానములో బోర్డ్ పరీక్షలు

Chandra Prakash
సీబీఎస్ఈ బోర్డు నిర్వహించే 2021 సంవత్సరం  పరీక్షలను రాత విధానములో నిర్వహించనున్నట్లు బోర్డ్ తెలిపింది. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్న బోర్డు ఎవరైన విద్యార్థులు హాజరు కాకపోతే ఆన్లైన్ లో నిర్వహించే పరీక్షలు రాసె అధికారం ఉండకపోవచ్చు అని తెలిసింది.అలాగే పదవ మరియు 12 వ తరగతి వారికి నిర్వహించే పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని కానీ పరీక్షలు మాత్రం ఖచ్చితంగా రాత విధానం లో నిర్వహించాలని నిర్ణయించారు.కరోనా వైరస్ ప్రబులుతున్న నేపథ్యంలో ముందుగా చాలా రాష్ట్ర ప్రభుత్వ బోర్డులు ఆన్లైన్ విధానం లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా తరువాత సమయంలో కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటు నేరుగా రాత విధానంలో నే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తెలుకున్నాయి. ఈ విధానము ప్రకారం  సీబీఎస్ఈ కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.అయితే ఈ పరీక్షలకు మార్కులను ఇరవై నుండి ముప్పై వరకు ఇవ్వాలని అలాగే వారి స్కూల్ మరియు వారి కాలేజి లొనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా ఈ వ్యవహారం అంత వేరే కాలేజీ నుండి వచ్చే ఉపాధ్యాయులు చేసుకుంటారని వారే విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారని బోర్డు తెలిపింది.కొందరు 2021 జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు అని ప్రచారం చేస్తున్న వేళ అది కేవలం దుష్ప్రచారం మాత్రమే అని బోర్డు సబ్యులు తెలిపారు. ఇప్పటికే చాలా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రాత విధానంలో పరీక్షలు నిర్వహించారు అని అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సైతం రాత విధానం లో నిర్వహించారు అని కాబట్టి కరోనా వైరస్ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు తగిన జాగ్రత్తలు తీసుకుంటు విద్యార్థుల పరీక్షలు, పోటీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: