నవంబర్ 23 నుంచి ఏపిలో పాలిటెక్నిక్, ఐటీఐ‌ కాలేజీలు ప్రారంభం..!!

Satvika
ఇటీవల జనాల జీవితాలను చీకటి మయం చేసింది కరోనా వైరస్..ఒకరి నుంచి మరొకరికి అంటుకోడం వల్ల వైరస్ వ్యాప్తి వేగవంతం అవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.. దాదాపు ఏడు నెలలు పూర్తిగా లాక్ డౌన్ ను విధించి ఇళ్లకే పరిమితం అయ్యేలా చేశారు.. అయితే ఇప్పుడిప్పుడే కొంత వరకు కరోనా నిబంధనలను పాటిస్తూ కొనసాగిస్తున్నారు.. అన్నీ రంగాలు పూర్తిగా ప్రారంభం అయ్యాయి కానీ, థియేటర్లు , విద్యా వ్యవస్థలు ఇంకా మూడపడి ఉన్నాయి.. నవంబర్ 2 నుంచి కొంతవరకు పాఠశాలలు తెరుచుకున్నా కూడా పై తరగతులు మాత్రమే పాక్షికంగా జరుగుతున్నాయి.



కరోనా ప్రభావం విద్యార్థుల్లో పెరుగుతుండటంతో విద్యా సంస్థలు ఆలోచనలో పడ్డాయి. ఎంత కఠినంగా చర్యలు తీసుకున్నా కూడా ఇలా జరగడంతో ఆందోళనకు గురవుతున్నారు.. అయితే నవంబర్ 23 నుంచి మిగిలిన కాలేజీలు, స్కూల్స్ ప్రారంభించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కొన్ని సందేహాలు మొదలు అవుతున్నాయి.. ఈ మహమ్మారి కారణంగా కారణంగా చదువులు అస్తవ్యస్తంగా మారాయి. దాదాపు ఏడు నెలలుగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి కొంతమేర అదుపులోకి రావడంతో ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలను పునఃప్రారంభించడానికి ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు నవంబ‌రు 23 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.



న‌వంబ‌రు 16న‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి 15 వరకు ఉండేలా నిర్ణయించారు. అలాగే.. పనిదినాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెమిస్టరుకు 90 చొప్పున మొత్తం 180 రోజులు తరగతులు నిర్వహిస్తారు. రెండో శనివారం కూడా అదనపు తరగతులు నిర్వహిస్తారు. ఐటీఐ కోర్సులకు సైతం ఇదే పద్ధతిని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది..ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో ఏడాది విద్యార్థులకు ముందుగా తరగతులు ప్రారంభిస్తారు. మొదటి ఏడాది విద్యార్థుల‌కు డిసెంబరు 14 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.ఇక మిగిలిన తరగతులను అలాగే హాస్టల్స్ ను డిసెంబర్ రెండోవ వారం నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: