ఏపి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..ఇకమీదట అటువంటివి ఉండవట..

Satvika
కరోనా సడలింపు లు తర్వాత విద్యాశాఖ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.. తాజాగా స్కూల్స్ ను ప్రారంభించిన ఏపి సర్కార్. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలను, స్కూల్స్ ను పునః ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు , ఉపాధ్యాయులు కరోనా నిబంధనలను పాటిస్తూ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులు కూడా భారీ సంఖ్య లో హాజరయ్యారు. ఇక ఉన్నత విద్యామండలి మాత్రం మరో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


ఏపి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు మొత్తం 127 రోజులు పని చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను వచ్చే సంవత్సరం మార్చి చివరి వారం లో నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్మీియట్ అకడమిక్ క్యాలెండర్ ను తాజాగా విడుదల చేసింది.

ఆ క్యాలెండర్ లో ఏప్రిల్‌ 24 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్‌ చివరి వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో రెండో శనివారం కూడా తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  అలాగే ఈ ఏడాదిలోని అకడమిక్ క్యాలెండర్ సెలవులను రద్దు చేస్తున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు అధికారులు  వెల్లడించారు. రానున్న 127 రోజులు కాలేజీలు పని చేయనున్నాయి. జూన్‌ 1 నుంచి 2021-2022 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కరోనా వల్ల ఒక సంవత్సరం తరగతులు వెనబడినవి వాటిని భర్తీ చేసుకోవాలంటే ఇలానే చేయాలి.. అప్పుడు కొంతవరకు  క్లాసులకు కవర్ చేసుకోవచ్చునని తెలిపింది.అప్పుడే మరో ఏడాదికి త్వరగా చేరుకోవచ్చు అంటూ ఏపి విద్యామండలి అధికారులు వెల్లడించారు.. ఈ క్యాలెండర్ కు సంబంధించిన పూర్తి వివరాలకు https://bie.ap.gov.in/ లో చూడవచ్చును.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: