ఏపిలో పది పాసైన విద్యార్థులకు హెచ్చరిక.. ఏపి సర్కార్ కీలక నిర్ణయం..

Satvika
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు, కాలేజీలు త్వరలోనే తెరుచుకోనున్నాయి.. ఈ మేరకు ఏపి సర్కార్ అన్నీ చర్యలను తీసుకుంటున్నారు. కరోనా ప్రభావం విద్యార్థులను తాకకుండా  ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్కూల్ ను , పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇప్పటికే అక్టోబర్ లో ఓపెన్ చేయాల్సిన స్కూల్స్ కరోనా ప్రభావం కొనసాగుతున్న కారణంగా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు.



ఇప్పుడు కాస్త కేసులు తగ్గుముఖం పట్టడం తో నవంబర్  2 నుంచి పాఠశాలలను యధావిధిగా  కొనసాగించనున్నట్లు విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకు కొన్ని పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. పది రాసిన వారికి ఇంటర్ అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది.. ఈ మేరకు అక్టోబర్ 21 నుంచి అభ్యర్థులను రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. గత సెమిస్టర్ ఆధారంగా పాస్ మార్కులను అందించింది. పాసైన విద్యార్థుల త్వరగా ఇంటర్ అడ్మిషన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.



ఇది ఇలా ఉండగా ఏపీలో ఇంటర్ అడ్మిషన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌ గడువును నవంబరు 6 వరకు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రకటన విడుదల తెలిపారు. గతంలో విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 21 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పాత షెడ్యూల్ ప్రకారం గురువారం తో గడువు ముగిసింది. అయితే చాలా కాలేజీల వివరాలను ఆన్ లైన్ లో ఉంచకపోవడం తో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం విధించిన గడువు లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కుదరలేదు.. ఈ విషయాన్ని  ఆ విద్యార్థులు, తల్లిదండ్రులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని కోరారు. దీని పై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గడువును పొడిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: