నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 50 వేల వేతనంతో ఉద్యోగాలు..!
ఇక ట్రైనీ ఆఫీసర్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి. అయితే ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసిన వారు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవాడనికి అర్హులు అని తెలిపారు. ఇక ప్రాజెక్ట్ అధికారి విభాగంలో 1 పోస్టు ఖాళీగా ఉంది. ఎంబీఏ లేదా MSV విద్యార్హత కలిగిన వారు ఇందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించడానికి ఆసక్తి కలిగిన వారై ఉండాలని నోటిఫికేషన్ లో వెల్లడించారు. జాబ్ పోస్టింగ్ ఉన్న ప్రదేశాలకు రీ లొకేట్ కావడానికి సిద్ధంగా ఉండాలి.
అయితే ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 7 నుంచి 21 వరకు BEL అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.. ఇక ట్రైనీ ఇంజనీర్, ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఆఫీసర్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను పైన ఇచ్చిన ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.bel-india.in ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.