నిరుద్యోగులకు కొలువుల జాతర.. ఆ విభాగంలో 93 వేల ఖాళీలు!

Kothuru Ram Kumar
ఇటీవల నిర్వహించిన ఓ అధ్యాయనం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఇక దేశంలో అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగంలో 93,500 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని ప్రకటన జారీ చేసింది. వీటిని భర్తీ చేస్తే ఆయా రంగాల్లో పని చేస్తున్న వారికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక అందుకు సంబంధించిన కోర్సులు నేర్చుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు రానున్నాయని వెల్లడించారు.
అయితే ఇండియాకు చెందిన అనలైటిక్స్ స్ట్రాటప్ కంపెనీలకు నిధులు పెరగడం ఈ ఉద్యోగాల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. ఇక ఏడేళ్ల అనుభవం ఉన్న వారికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు టైర్-2, టైర్-3 నగరాల్లో ఈ ఉద్యోగాల శాతం జనవరి నుంచి ఇప్పటి వరకు 8.4 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగిందని అధికారులు తెలిపారు. ఫార్మా రంగం అనలిటిక్స్ ఉద్యోగాల నిష్పత్తిలో 16.3 శాతానికి పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మొత్తం 3.9 శాతం పెరిగింది. కోవిడ్ -19 వైరస్ కోసం టీకాలు, ఇతర మందులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం దీనికి కారణం ”అని నివేదిక వెల్లడించింది.
ఇక ఆక్సెంచర్, ఎంఫసిస్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఐబీఎం ఇండియా, డెల్, హెచ్ సీఎల్ తదితర ప్రముఖ కంపెనీల్లో డేటా సైన్స్ విభాగంలో అత్యధిక ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు భారతదేశంలో డేటా సైన్స్ నిపుణుల సగటు జీతం 2020లో సంవత్సరానికి రూ .9.5 లక్షలు అని అధ్యయనం వెల్లడించింది. పదేళ్లకు పైగా అనుభవం ఉన్నవారికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని తెలిపారు. వారి నైపుణ్యం, వారి రోల్ ఆధారంగా ఏడాదికి రూ .25 లక్షల నుంచి రూ .50 లక్షల ప్యాకేజీలను ఆయా కంపెనీలు అందించే అవకాశం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: