ఇంటర్ చదువుతో కొలువు.. ఆప్టోమెట్రీలో అద్భుత అవకాశాలు..!
ఐతే ఈ కన్ను తతంగం ఏమిటని అనుకుంటున్నారా? అదేనండి అక్కడికే వస్తున్నా. ఇపుడు ఈ కన్నుకు సంబందించిన కోర్సు ఒకటి వుంది. అదే ఆప్టోమెట్రీ. కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు వున్నా ఆప్టోమెట్రీషియన్లు పరిష్కరించగలరు. ఇపుడు వయసుతో సంబంధం లేకుండా దాదాపు అన్ని వయసుల వారూ ఏదో ఒక కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఓ సర్వే తెలిపింది. ఈ కంటి పరీక్షలను ప్రాథమిక స్థాయిలో క్షుణ్ణంగా నిర్వహించేవాళ్లనే మనం ఆప్టోమెట్రీషియన్లు అంటాం.
వీళ్లు చేసే తగిన టెస్ట్ ల ఆధారంగానే తర్వాతి దశలో చికిత్సలు ఆరంభం అవుతాయి. ఈ అధునూతన సమాజంలో తక్కువలో తక్కువ 60 శాతానికి పైగా ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతీ యువకులలో కంటి సమస్యలు చాలా తీవ్ర స్థాయిలో వున్నాయి. కంప్యూటర్లు, మొబైళ్ల వంటి ఆధునిక పరికరాల వినియోగం ఎక్కువై కళ్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. చిన్న వయసులోనే పలు రకాల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
దాదాపు ప్రతి కంటి ఆసుపత్రిలోనూ ఆప్టోమెట్రీషియన్లు ఉండటం మనం గమనించవచ్చు. ఇంటర్ విద్యార్హతతో ఆప్టోమెట్రీలో డిప్లొమా, అలాగే బ్యాచిలర్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ అన్ని గ్రూపుల వారూ డిప్లొమాలో చేరవచ్చు. వ్యవధి 2 సంవత్సరాలు. ఆసక్తి ఉన్న వాళ్లు ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఆప్టోమెట్రీ కోర్సులు చేసి, తరువాత సంబంధిత ఆసుపత్రులలో గాని, లేదంటే సంబంధిత లేబొరేటరీలలో గాని ఉపాధిని పొందవచ్చు.