డిఫెన్స్‌లో ఉద్యోగాల కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల...!

Kothuru Ram Kumar
నిరుద్యోగులకు గుడ్ న్యూస్... తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ ను జారీ చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2 ఎగ్జామినేషన్ 2020 సంబంధించి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా 344 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులో హైదరాబాద్ నగరం లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో కూడా ఖాళీలు ఉన్నాయి. ప్రతి ఏట కేవలం రెండుసార్లు మాత్రమే ఈ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని డిఫెన్స్ లోని ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో కి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైపోయింది. ఇందుకు చివరి తేదీ ఆగస్టు 26. అలాగే ఈ నోటిఫికేషన్ నుంచి పూర్తి వివరాల కొరకు  https://upsc.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి. ఇక దరఖాస్తును పూర్తి చేయాలనుకున్నవారు https://upsconline.nic.in ఈ లింక్ ని క్లిక్ చేయండి.

ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్ లో 100 పోస్టులను... అలాగే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై నగరంలో 167 పోస్టులను, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ మహిళల కొరకు చెన్నై నగరంలో 17 పోస్టులను, వీటితో పాటు ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమల నగరంలో 26 పోస్టులను, హైదరాబాద్ నగరంలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో 32 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాల్లోకి చూస్తే... ఆగస్టు 5 నుండి ఈ నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆగస్టు 26 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఒకవేళ ఇందుకు సంబంధించి విత్ డ్రా చేసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 లోపల విత్ డ్రా చేసుకోవాలి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఓసి, బిసి అభ్యర్థులకు 200 రూపాయలు ఉండగా... ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హత చూస్తే..  వివిధ పోస్టులకు వివిధ రకాలుగా ఇంటర్, డిగ్రీ లలో పాస్ అయి ఉండాలి. అలాగే ఇందుకు సంబంధించిన కోర్సులలో చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులు. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాలలో తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాదు లను సెంటర్లుగా ఎంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: