భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( BEL) లో ఉద్యోగాలు... పూర్తి వివరాలు మీకోసం...!
దేశంలోని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( BEL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులోని పలు విభాగాల్లోని ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం 77 ఖాళీలను ప్రకటించింది. ఘజియాబాద్ లో ఉన్న యూనిట్, నేవీ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో పాటు పలు ప్రాజెక్టుల్లో వీరందని నియమించనున్నారు. ఇకపోతే దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మోడలింది కూడా. అలాగే అప్లై చేయడానికి చివరి తేదీ 2020 ఆగస్ట్ 2. ఇక ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు అప్లై చేసుకోవడానికి 2020 ఆగస్ట్ 17 చివరి తేదీ.
ఇక ఈ నోటిఫికేషన్ కు పూర్తి వివరాల కోసం https://bel-india.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2020 సంబంధించి ఖాళీల వివరాలు ఇవే... మొత్తం ఖాళీలు 77 ఉండగా అందులో ప్రాజెక్ట్ ఇంజనీర్ 1, ఈసీఈ - 8, కంప్యూటర్ సైన్స్- 13, ట్రైనీ ఇంజనీర్ - 5 , ట్రైనీ ఇంజనీర్ (1) - 20 , ప్రాజెక్ట్ ఇంజనీర్ (1) - 30 గా ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశాలు చూస్తే... ఈ ఉద్యోగాలకు కావలిసిన విద్యార్హతలు - వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా విద్యార్హతలున్నాయి. బీటెక్/ బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులు.
ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు ఫీజు ఈ విధంగా ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ పోస్టు ఫీజు రూ.200, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టు ఫీజు రూ.500. ఇక మీలో ఎవరైనా ఇందుకు సంబంధించి అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ప్రక్రియ ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది.