తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవ్వకండి!!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. చైనాలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ప్రపంచదేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయాలంటే వ్యాక్సిన్ కనిపెట్టడం తప్పనిసరి కావడంతో.. ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక మరోవైపు కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది.
ఈ క్రమంలోనే కరోనా కారణంగా ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకషనల్ ఇన్‌స్టిట్యూషన్స్.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో 58 ఖాళీలు ఉన్నాయి. వీటి పూర్తి వివరాలు చూస్తే.. మొత్తం 58 ఖాళీల్లో.. స్టాఫ్ నర్స్- 3, ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- 14, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- 2, కేర్ టేకర్ (డిగ్రీ కాలేజ్)- 10, జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ- 1, ల్యాబ్ అసిస్టెంట్ / ల్యాబ్ అటెండర్- 14, కిచెన్ హెల్పర్- 3 మరియు ఆఫీస్ సబార్డినేట్స్- 11 పోస్టులు ఉన్నాయి.
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అయితే ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. వేతనాల వివరాలు చూస్తే.. స్టాఫ్ నర్స్- రూ.17,500, ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- రూ.15,000, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- రూ.20,000, కేర్ టేకర్ (డిగ్రీ కాలేజ్)- రూ.15,000, జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ- రూ.15,000, ల్యాబ్ అసిస్టెంట్ / ల్యాబ్ అటెండర్- రూ.15,000, కిచెన్ హెల్పర్- రూ.12,000 మరియు ఆఫీస్ సబార్డినేట్స్- రూ.12,000గా నిర్ణయించారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి 2020 జూలై 30 ఆఖరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవలెను. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.