ఆ విద్యాసంస్థలకు తెలంగాణ సర్కార్ షాక్.... ?

Durga Writes

విద్య ప్రస్తుతం వ్యాపారం అయినా సంగతి తెలిసిందే.. రోజు రోజుకు విద్య సంస్దలు పెరుగుతున్నాయి.. దానికి తగ్గట్టే ఫీజులు పెరుగుతున్నాయి.. అయితే ప్రభుత్వం ఇన్నాళ్లు ఎప్పుడు కూడా విద్యను వ్యాపారం చేసే విద్య వ్యాపారులను పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు పట్టించుకుంటుందా. దీనికి కారణం కరోనా వైరస్. 

 

రోజు రోజుకు పెరుగుతున్న ఈ కరోనా వైరస్ ను నియంత్రించాలి అనే ఉద్ద్యేశంతో దేశం అంత లాక్ డౌన్ అమలు చేస్తున్నాయ్. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.. అయితే లాక్ డౌన్ కారణంగా మధ్య తరగతి వారికీ ఇన్కమ్ ఏ లేకుండా పోయింది. దీంతో మధ్యతరగతి వారు నిత్యావసరాలు కొనడమే కష్టంగా మారింది. 

 

ఇంకా అలాంటి మధ్యతరగతి వాళ్ళు పిల్లల చదువుకు డబ్బు ఎక్కడ నుండి తెచ్చిపెడుతారు.. ఇంకా అందుకే ఈ ఏడాది ప్రయివేటు పాఠశాలలు ట్యూషన్‌ ఫీజులు పెంచినా, మొత్తం ఫీజును ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి తెచ్చినా 18004257462 టోల్‌ఫ్రీ నంబరుకు తల్లిదండ్రులు ఫిర్యాదు చెయ్యాలి అని తెలంగాణ సర్కార్ సూచించారు.. అంతేకాదు ఈ మెయిల్ commr.edn.greviance@gmail.com కు ఫిర్యాదు పంపచ్చు అన్నారు. 

 

అంతేకాదు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు అన్ని కూడా డిజిటలైజేషన్‌ చేసినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను www.scert.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. 

 

ఇంకా అలాగే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు T-SAT యాప్‌లో వీడియోల రూపంలో కూడా పాఠాలు ఉన్నాయని ప్రకటించారు.. ఏమైతేనేం విద్యార్థుల తల్లితండ్రులకు కాస్త ఉరటనిచ్చారు.                                  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: