రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. మరో వారమే గడువు
ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 926 అసిస్టెంట్ పోస్టుల్ని ప్రకటించింది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక చేస్తారు. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్బీఐ. ఆర్బీఐలో అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయంలో కూడా ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 16 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ www.rbi.org.in ఓపెన్ చేసి మరిన్ని వివరాలు చూడొచ్చు. పోస్టుల ఖాళీల విషయానికి వస్తే.. 926 అసిస్టెంట్ పోస్టులు కాగా వాటిలో అహ్మదాబాద్- 19, బెంగళూరు- 21, భోపాల్- 42, భువనేశ్వర్- 28, చండీగఢ్- 35, చెన్నై- 67, గువాహతి-55, హైదరాబాద్- 25, జైపూర్- 37, జమ్మూ- 13, కాన్పూర్ అండ్ లక్నో- 63, కోల్‌కతా- 11, ముంబై- 419, నాగ్‌పూర్- 13, న్యూఢిల్లీ- 34, పాట్నా- 24, తిరువనంతపురం అండ్ కొచ్చి- 20 పోస్టులున్నాయి.
కాగా, ఆర్బీఐలో అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 23న ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 16 చివరి తేదీ. 2019 డిసెంబర్ 23 నుంచి 2020 జనవరి 16 నుంచి ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలి. దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి 2020 జనవరి 16 చివరి తేదీ. దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి 2020 జనవరి 31 చివరి తేదీ. విద్యార్హత వివరాలు చూస్తే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ 50% మార్కులతో పాస్ కావాలి. కంప్యూటర్లో వర్డ్ ప్రాసెసింగ్ తెలిసి ఉండాలి. దరఖాస్తు ఫీజు- రూ.450. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.