నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెచ్పీసీఎల్లో మేనేజర్ ఉద్యోగాలు..
ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా..? ఏదో ఉద్యోగం కోసం కన్సల్టెన్సీలను సంప్రదిస్తూ.. వేలకు వేలు సమర్పించుకుంటున్నారా..? ఉద్యోగాలు లేక కష్టాలు ఎదుర్కొంటున్నవారికి శుభవార్త. భారతదేశంలో విస్తరిస్తున్న కొత్త రంగాలు మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నాయి. తాజాగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్- hpcl ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టుల్న భర్తీ చేస్తోంది.
వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 31 చివరి తేదీ. మరియు హెచ్‌పీసీఎల్ మొత్తం 24 ఉన్నాయి. అందులో చీఫ్ జనరల్ మేనేజర్ (CGM)- 1, అసిస్టెంట్ మేనేజర్ (IPRC)- 01, సీనియర్ మేనేజర్ (FCC)- 01, అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Hydro Processing)- 01సీనియర్ మేనేజర్ (Catalysis)- 01, సీనియర్ మేనేజర్ (Nanotechnology)- 01, అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Catalysis)- 01, ఆఫీసర్ (Catalysis)- 04 ఉన్నాయి
వీటితో పాటు..ఆఫీసర్ (Nanotechnology)- 02, సీనియర్ మేనేజర్ అనలిటికల్- 02, ఆఫీసర్ అనలిటికల్- 03, అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Bioprocess)- 01, ఆఫీసర్ (Bioprocess)- 01, సీనియర్ మేనేజర్ (Polymer/ Petrochemical)- 01, ఆఫీసర్ (Polymer / Petrochemical)- 01, అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Metallurgy/Corrosion Study)- 01, చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (Analytical)- 01 పోష్టు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hindustanpetroleum.com/ వెబ్సైట్లో చూడొచ్చు.