“ఇండియన్ కోస్ట్ గార్డ్” లో...ఉద్యోగాలు...!!!!
ఇండియన్ కోస్ట్‌గార్డ్ లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల
అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా డొమెస్టిక్ బ్రాంచ్‌లో నావిక్ పోస్టులు, అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల, భర్తీకి అర్హులైన
పురుష, మహిళా అభ్యర్ధుల నుంచీ ధరఖస్తులని కోరుతోంది.
పోస్టుల వివరాలు..
అసిస్టెంట్ కమాండెంట్
(గ్రూప్-ఏ) (గెజిటెడ్ ఆఫీసర్)
విభాగాలు: జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ (షార్ట్
సర్వీస్ అపాయింట్‌మెంట్- ఎస్‌ఎస్‌ఏ), కమర్షియల్ పైలట్ ఎంట్రీ (సీపీఎల్ ఎస్‌ఎస్‌ఏ), టెక్నికల్ (ఇంజనీరింగ్ అండ్
ఎలక్ట్రికల్), లా.
అర్హత: పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 60
శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు
డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉండాలి.
వయసు: కొన్ని పోస్టులకు జులై 1, 1995 - 30 జూన్, 1999 మధ్య జన్మించి
ఉండాలి. మరికొన్ని పోస్టులకు జులై 1,
1995 - జూన్ 30, 2001 మధ్య జన్మించి
ఉండాలి.
ఎంపిక: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: మే 24, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 4,
2019.
నావిక్ (డొమెస్టిక్
బ్రాంచ్)-02/2019 బ్యాచ్
పోస్టులు: కుక్, స్టీవార్డ్.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి
ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలుండాలి.
వయసు: 2019, అక్టోబర్ 1 నాటికి 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట
వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 5, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 10, 2019.
పరీక్ష నిర్వహణ: జూన్/జులై, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://joinindiancoastguard.gov.in