జీవి రెడ్డిని ఫైబ‌ర్ నెట్‌ నుంచి త‌ప్పిస్తారా... ఆ శాఖకు బ‌దిలీ చేస్తారా.. !

frame జీవి రెడ్డిని ఫైబ‌ర్ నెట్‌ నుంచి త‌ప్పిస్తారా... ఆ శాఖకు బ‌దిలీ చేస్తారా.. !

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌గా ఉన్న యువ నేత టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయా.. అంటే అవకాశం ఉందని.. పార్టీ వర్గాలు, ప్రభుత్వ వర్గాలలో గట్టిగా ప్రచారం నడుస్తోంది. ఫైబర్ నెట్ డైరెక్టర్ గా ఉన్న ఐఏఎస్ అధికారిపై ఆయన రాజ‌ద్రోహం అంటూ .. అత్యంత సీరియస్ కామెంట్లు చేసిన నేపథ్యంలో .. ఈ వార్త జాతీయ‌ స్థాయిలో బాగా హైలైట్ అయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వద్ద.. మరో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రస్తావించినట్టు కూడా జాతీయ మీడియా పేర్కొంది. అసలు ఫైబర్ నెట్‌లో ఏం జరుగుతుంది.. అనేదానిపై కేంద్ర మంత్రి ఆరా తీసినట్టు సమాచారం.


దీనిపై ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కూడా సమాచారం చేరడంతో.. ఈ వ్యవహారం కేంద్ర స్థాయిలో పెద్దది అవుతున్నట్టు గుర్తించిన‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే .. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆ వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయారు. జీవి రెడ్డి తను వాదన బలంగా వినిపిస్తున్నారు. డైరెక్టర్‌ను తొలగించాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో ఫైబర్ నెట్‌లో ఆక్రమాలు చోటుచేసుకున్నాయని.. దీనిని మూసివేసే దిశ‌గా అధికారులు అడుగులు వేస్తున్నట్టు సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాదు తను చేసిన రాజ‌ద్రోహం ఆరోపణలకు కట్టుబడినట్లు తెలిసింది.


ఇవన్నీ ఇలా ఉంటే.. అసలు ఛైర్మన్ గా ఉండేందుకు కూడా ఆయన సుముఖ‌త వ్య‌క్తం చేయ‌నట్టు సమాచారం. మరోవైపు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా జీవీ రెడ్డి పై ఆగ్రహంతో ఉంది. ఐఏఎస్‌ల‌ను రాజ ద్రోహులుగా చిత్రీకరించిన వ్య‌వ‌హారం పట్ల సీనియర్ అధికారులు కన్నెర్ర‌ చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబును కలుసుకుని అపాయింట్మెంట్ కోరారు. మొత్తంగా జేవిరెడ్డి చేసిన రచ్చ సర్కార్‌ మెడకు తగులుతుంది. దీంతో.. ఏకంగా జీవి రెడ్డిని తప్పించే పర్యటన శాఖకు పంపాలన చర్చ సాగుతోంది. మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: