మరణాలు - మర్యాదలు- భారతదేశ నేతల విషయంలో ఏం జరిగింది..!
ఆయన మరణం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. నిస్వార్థ నిరాడంబర జీవితాన్ని ఆసాంతం అనుసరిం చిన మన్మోహన్ గురించి కుల, మత ప్రాంతాలకు అతీతంగా అందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. ఇంతలోనే కాంగ్రెస్ మర్యాదల పేరుతో రాజకీయాలకు తెరదీసింది. ఆయనను మట్టి చేసిన చోటే స్మారకం నిర్మించాలని.. దీనికి కొన్ని ఎకరాల భూమిని కేటాయించాలని.. ఆయనను మర్యాద పూర్వకంగా సాగనంపాలని.. ఇంకా ఏవేవో పేర్కొంటూ.. కేంద్రంలోని మోడీ సర్కారుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.
వాస్తవానికి ఏ విషయం ఆ విషయంగా చూసినప్పుడు.. మన్మోహన్ సింగ్ విషయంలో కేంద్రం చాలా జాగ్రత్తలు తీసుకుంది.ఎక్కడా ఆయన మర్యాదకు లోటు రాకుండా.. గౌరవానికి భంగం కలగకుండా సకల ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ మర్యాదలు, సెలవులు, జాతీయ పతాకం అవతనం.. ఏడు రోజుల సంతాప దినాలుఇలా.. అప్పటికప్పుడు చేయాల్సినవి ఎవరూ కోరకుండానే చేసింది. కానీ.. తుది క్రియలు జరిగిన తర్వాత.. చేయాల్సిన వాటి విషయంలో కాంగ్రెస్ తొందరపడిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ క్రమంలోనే తర్వాత ఏం చేయాలనే విషయంపై 4 పేజీల సుదీర్ఘ లేఖ కాంగ్రెస్ నుంచి మోడీకి చేరిం ది. మర్యాదలకు తక్కువ చేయొద్దని కూడా.. పేర్కొన్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్‌ను ఇప్పుడు అడకత్తెరలోకి నెట్టింది. మాజీ రాష్ట్రపతి దివంగత కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ సహా.. మాజీ ప్రధాని.. ఆర్థిక వేత్త, బహుభాషా కోవిదుడు దివంగత పీవీ నరసింహారావుల విషయంలో కాంగ్రెస్ చేసిందనే ప్రశ్నలు ఇప్పుడు తెరమీదికి వచ్చాయి. వారికి `సుముచిత తుది మర్యాదలు మీరు ఇచ్చారా?` అని నిప్పులు చెరుగుతూ.. ప్రణబ్ కుమార్తు శర్మష్ఠ ముఖర్జీ నిలదీశారు.
రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించిన తన తండ్రి 50 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ సేవకుడిగా ఉన్నారని.. ఆయన మరణిస్తే.. కనీసం ఏఐసీసీ కమిటీ సమావేశమై నివాళులర్పించిందా? అని శర్మిష్ఠ నిలదీశారు. కష్ట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్లు ముందుకు నడిపి.. దేశాన్ని ఆర్థిక ప్రగతి పథంలో ముందుకు సాగేలా చేసిన మాజీ ప్రధాని పీవీ పార్థివ దేహాన్ని కనీసం కాంగ్రెస్ కార్యాలయంలోకి అనుమతించకుండా గేట్లు మూసేసిన విషయాన్నిప్రధానంగా ప్రశ్నించారు.
తప్పులు మీరు చేసి.. పొరుగు వారు ఇంకా ఏమీ చేయకుండానే.. నిప్పులు చల్లాలనే ప్రయత్నం ఎందుకంటూ.. నిలదీశారు. సోషల్ మీడియా జనాలు కూడా.. దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో మరణాలు-మర్యాద ల విషయంలో కాంగ్రెస్ బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది..!