జనంపై కోపం.. జగన్‌కు ఇంత చేటు చేస్తోందా..?
అయినప్పటికీ.. జగన్ మౌనంగానే ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జనాలు తనకు వ్యతిరేకంగా ఓటె త్తారన్న ఆవేదన ఉండడం తప్పుకాదు. కానీ, జగన్ వైఖరి గమనిస్తే.. కోపం కనిపిస్తోంది. ఇది ప్రమాదకరం. ఇప్పటికి మూడు సార్లుగా కేంద్రంలో అధికారం కోల్పోతున్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం తన సత్తా చూపిస్తూ నే ఉంది. ప్రజలు తనకు పట్టం కట్టడం లేదని.. మౌనంగా ఉండడం లేదు. ఎక్కడికక్కడ ప్రజలకు చేరువ అవుతూనే ఉంది. ప్రజల సమస్యలపై స్పందిస్తూనే ఉంది.
ఈ స్ఫూర్తి జగన్‌కే కాదు.. ఏ పార్టీకైనా అవసరం. కమ్యూనిస్టులను తీసుకుంటే.. వారికి ఓటేసేవారు ఎంత మందో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ.. వారు ప్రజల కోసం గళం వినిపించడం లేదా? ప్రజలు ఓటేయడం లేదని కార్యాలయాలు మూసేసుకున్నారా? అంతిమంగా అధికారం అవసరమే అయినా.. కాలం కలిసి రానప్పుడు.. ప్రజలను అంటిపెట్టుకుని ఉండాల్సిన అవసరం పార్టీలకు, నాయకులకు కూడా ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని జగన్ ఎందుకు మిస్సవుతున్నారన్నదే ప్రశ్న.
జనంపై ఉండాల్సింది ప్రేమే తప్ప.. పగ కాదు. జనంపై ఉండాల్సింది.. ఆలోచనే తప్ప ఆగ్రహం కాదు. ఈ రెండు విషయాలు తెలుసుకుంటేనే పార్టీకి.. నాయకుడిగా జగన్ కు కూడా మనుగడ. లేకపోతే.. ప్రజల్లో విర క్తి మొదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే.. ఇప్పటికైనా ఆయన జనం బాట పడితే మంచిది.. లేకపోతే.. మరింత నష్టపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ప్రతి విషయాన్ని ఆలోచనాత్మకంగా చూడాలే తప్ప.. ఆగ్రహంతో కాదు!!