పార్లమెంటు పోరు: ఈ ఒక్క స‌మ‌స్య‌ తీరితే ఏపీ ఇండియాలో సూప‌ర్ స్టేట్‌

RAMAKRISHNA S.S.
- 151 మంది ఎమ్మెల్యేలు... 36 ఎంపీలున్నా వైసీపీతో శూన్యం
- 18 మంది ఎంపీల‌తో బాబు, ప‌వ‌న్ కేంద్రాన్ని వంచుతారా
- సానుకూల ధోర‌ణితోనే బాబు మోడీని ఒప్పించి.. మెప్పించాలి..
( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )
పోలవరం ప్రాజెక్టు విషయంలో.. అదే విధంగా కడప స్టీల్ ప్లాంట్‌ విషయంలో.. విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గానీ కూట‌మి పార్టీల నేతలు కానీ ఏ మేరకు నిధులు కేటాయించగలరు? అనేది ప్ర‌శ్న‌. త్వ‌ర‌లోనే కేంద్రం ప్రవేశపెడుతు న్న బడ్జెట్లో ఏ మేరకు నిధులు తీసుకోకు రాగలరు? అనేది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్న అంశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి అదేవిధంగా ప్రాజెక్టుల అభివృద్ధికి కూడా టిడిపి అధినేతగా చంద్రబాబునాయుడు గ‌ట్టి హామీ ఇచ్చారు.

వైసిపి ప్రభుత్వానికి 151మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. 36 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయారని పైగా రాష్ట్రం వైసీపీ పాల‌న‌లో 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు వరకు వెనక్కి వెళ్లిపోయిందని ఆక్షేపించారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అన్నట్టుగా గత వైసిపి పార్టీకి 22 మంది ఎంపీలు ఇస్తే ఇప్పుడు టిడిపికి 16 మంది, జ‌న‌సేన‌తో క‌లిపి 18 మంది ఎంపీలను ప్రజలు అందించారు. దీన్ని బట్టి వారిపై ఆశలు బాగానే ఉన్నాయి.

అటు ఎవరినీ విమర్శించకుండా.. ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను పట్టించుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు కానీ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాని పట్టించుకోలేదని విమర్శలు వినిపించి.. అప్పుడు ఢిల్లీకి వెళ్లి తన కేసులు తన కుటుంబం పై ఉన్న కేసులను పరిష్కరించుకోవడంలో అప్పటి ముఖ్యమంత్రి బిజీబిజీగా గడిపారని అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉండే టిడిపి విమర్శలు గుప్పించింది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం టిడిపి చేతుల్లోకే వచ్చింది.

కాబట్టి గతంలో చేసినట్టుగా కాకుండా ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా నిర్వహించాలని మేధావుల మాట. టిడిపికి అదేవిధంగా జనసేన కు కూడా ప్రజలు మరింత బ్రహ్మరథం పట్టారు. ఇది ఓ మంది అవకాశంగా ఉందని సూచిస్తున్నారు. ఎందుకంటే అటు రాయలసీమ అభివృద్ధి చెందడానికి కడప ఉక్కు కర్మాగారం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంక్షోభాన్ని నివారించడంలో పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లు జోన్లు కూడా అభివృద్ధి చెందుతాయి.

అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబునాయుడు ఏ విధంగా అయితే సానుకూల ధరణితో సానుకూ ల చర్చలు జరపడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారో ఇప్పుడు దానిని కొనసాగించి కేంద్రాన్ని ఒప్పించగలిగాల‌నేది కీల‌కం. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే సూపర్ స్టేట్‌ స్థాయికి పోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. మ‌రి పార్ల‌మెంటు పోరులో ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: