జ‌గ‌న్ బ‌య‌ట ఉంటే ఓడించ‌డం క‌ష్టం.. తెర‌వెనుక ఏం జ‌రుగుతోందంటే...!

VUYYURU SUBHASH
ఔను! ఇప్పుడు ఇదే విష‌యం.. ఏపీ రాజ‌కీయాల్లో క‌న్నా కూడా పొరుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా జ‌రు గుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం.. రెండు కీల‌క పార్టీల‌కు అత్యంత ప్ర‌ధానం. వీటిలో ఒక టి టీడీపీ. రెండు జ‌న‌సేన‌.ఎలాగంటే.. టీడీపీ ఇప్ప‌టికే ఆర్థికంగా, నేత‌ల ప‌రంగా.. అధికారం కోల్పోయి.. తీవ్ర ఇబ్బందులు ప‌డుతోంది. మ‌రోసారి కూడా అధికారం కోల్పోతే.. ఇక‌. .పార్టీపై ఆశ‌లు వ‌దులుకునే ప‌రిస్థితికి దిగ‌జారుతుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీకి అధికారంలోకి రాక‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉంది. ఇక‌, జన‌సేన ప‌రిస్థితి దీనికి విరుద్ధంగా అయితే.. క‌నిపించ‌డం లేదు.

ఎందుకంటే.. పార్టీ పెట్టి ఇప్ప‌టికే 9 సంవ‌త్స‌రాలు అయినా.. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా ప్ర‌జాప్ర‌తినిధు లు లేని మ‌రో క‌మ్యూనిస్టు పార్టీగా జ‌న‌సేన ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. క‌నీసం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు, ఒక‌రిద్ద‌రు ఎంపీల‌ను సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌గా జ‌న‌సేన కూడా అడుగులు వేస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో ఈ రెండు పార్టీల‌కు.. ప్ర‌ధాన ప్ర‌తిబంధకంగా ఉన్న‌ది వైసీపీ. ఈ పార్టీ ఇంత బ‌లంగా ఉంటే.. ముఖ్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్ ఇంత బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన ల ఆశ‌లు తీరేలా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ను అత్యంత వేగంగా.. జైలుకు పంపించాల‌నే  తెర‌చాటు వ్యూహంగా ఉంద‌ని.. మేధావులు చెబుతున్నారు.

అయితే.. ఇక్క‌డ ఒక ప్ర‌శ్న రావొచ్చు.. జ‌గ‌న్ లేకుండా పోతే.. టీడీపీ, జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకుంటా యా?  జ‌గ‌న్‌పై మ‌రింత సింప‌తీ పెరుగుతుంది క‌దా?  అప్పుడు.. వైసీపీ మ‌రింత వ్యూహాత్మ‌కంగా ముందు కు క‌దులుతుంది క‌దా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. వీటికి ఒక్క‌టే స‌మాధానం. జ‌గ‌న్ క‌నుక లేకుండా పోతే.. గ‌తంలో మాదిరిగా.. (అంటే.. జ‌గ‌న్ జైలుకు వెళ్తే.. ష‌ర్మిల వ‌చ్చి పాద‌యాత్ర చేసి పార్టీని బ‌తికించింది) ఇప్పుడు.. వైసీపీని కాపాడే నాయ‌కులు ఆయ‌న కుటుంబం నుంచి ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఇదే ఇప్పుడు.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల కు క‌లిసి వ‌స్తున్న ప‌రిణామం. ఈ వ్యూహంలో భాగంగానే.. జ‌గ‌న్ కుటుంబంలో జ‌గ‌న్‌ను అంద‌రూ వెలివేసేలా వారు.. వివేకా కేసును వాడుకున్నార‌నే చ‌ర్చ సాగుతోంది.

అంటే.. జ‌గ‌న్ జైలుకు వెళ్లిపోతే.. పార్టీలోని నేత‌ల‌ను కాంగ్రెస్‌, జ‌న‌సేన‌, టీడీపీలు పంచేసుకుంటాయి. త‌ద్వారా.. వైసీపీ పూర్తిస్థాయిలో బ‌ల‌హీన ప‌డిపోతుంది. దీంతో టీడీపీ-జన‌సేన‌, కుదిరితే.. కాంగ్రెస్‌లు కూట‌మిగా ఏర్ప‌డి.. ఏపీలో అధికారంలోకి వ‌చ్చేయాల‌నేది మాస్ట‌ర్ ప్లాన్‌గా ఉంద‌ని చెబుతున్నారు మేధావులు. జ‌గ‌న్ బ‌య‌ట ఉంటే.. మాత్రం ఆయ‌న‌ను ఎదిరించే ప్ర‌య‌త్నం వీరి వ‌ల్ల‌కాద‌నే విష‌యాన్ని కూడా వీరు గుర్తించిన‌ట్టుచెబుతున్నారు. అయితే.. ఎప్పుడు ఎలా జ‌గ‌న్‌ను వ‌దిలించుకోవాల‌నే విష‌యంపై మాత్రం ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు.. ఈ వ్యూహాన్ని బీజేపీతో క‌లిసి అమ‌లు చేయొచ్చ‌ని అంటున్నారు. మ‌రి ఏపీ రాజ‌కీయం ఎటు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: